ఇటలీని హడలెత్తిస్తున్న కరోనా...!
ప్రపంచంలో కరోనా రెండో విడత ప్రారంభం అయింది. దీని కారణంగా ప్రపంచ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా రోజురోజుకు తన పంజాలను మరింత విస్తృతానికి విసురుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి దేశంలో కూడా కరోనా కేసులు నమోదులో రోజుకో కొత్త రికార్డును చవి చూస్తోన్నాయి. అయితే ఇటీవల ఇటలీలో కొన్ని నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. దాంతో దేశంలో కరోనా పెరుగుదలకు ఈ నిరసన కారులే కారణం అయ్యుండొచ్చని కొందరు అంటున్నారు. అయితే ఇటీవల అందిన నివేదిక ప్రకారం ఇటలీలో కరోనా మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో దాదాపు 564 కరోనా మరణాలు సంభవించాయి. దాంతో ఇప్పటికి ఇటలీ దేశంలో సంభంవించిన మొత్తం కరోనా మరణాల సంఖ్య 60,078కి చేరింది. అయితే గత 24గంటల్లో దాదాపు 18,887 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటికి నమోదయిన కరోనా కేసులు 1,728,878కు చేరింది. వారిలో దాదాపు 913,500 మంది కోలుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. అంతేకాకుండా దీనిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అనేక పాట్లు పడుతున్నాయి. ప్రజలను అప్పమత్తం చేస్తూ కావలసిన జాగ్రత్తలను పాటిస్తున్నాయి. కొందరు ప్రముఖుల ప్రకారం కరోనా మూడో విడత కూడా వచ్చే ప్రమాదం ఉదనడంతో ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేశాయి. మరి ఈ వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.
