Top Ad unit 728 × 90

జపాన్ బుల్లెట్ ట్రైన్ వెనుక అంత కథ ఉందా

కింగ్ ఫిషర్, గుడ్లగూబ ఆదర్శం: జపాన్ బుల్లెట్ ట్రైన్ వెనుక అంత కథ ఉందా

 

చీమను చూసి పొదుపు ఎలా చేయాలో మానవుడు నేర్చుకున్నాడు... పక్షిని చూసి గాలిలో ఎలా ఎగరాలో తెలుసుకున్నాడు. చేపను చూసి ఎలా ఈదాలో తర్ఫీదు పొందాడు.

 

 

అలాగే సాంకేతికతను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన జపాన్ కింగ్ ఫిషర్, గుడ్లగూబను ఆదర్శంగా తీసుకుని బుల్లెట్ ట్రైన్ రూపొందించింది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినా, ఇది నిజం. 1984 అక్టోబర్ 1 జపాన్ లో ఒలంపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి పది రోజుల ముందే బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్రంగా నష్టపోయిన జపాన్... తర్వాత నెమ్మదిగా కోలుకుంది. ప్రపంచంలో అత్యంత కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న జపనీయులు, తమ కృషితో దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపారు. అయితే సుజీ మౌంట్ పోస్ట్ జపాన్ లో ప్రారంభించిన బుల్లెట్ ట్రైన్ కు చిహ్నంగా మారింది. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ రూపొందించడం వెనక పెద్ద కథే ఉంది.

 

కింగ్ ఫిషర్, గుడ్లగూబ ఆదర్శం

పక్షుల్లో కింగ్ ఫిషర్ ది ప్రత్యేకమైన ఆకారం. ముక్కు పెంగ్విన్ మాదిరి పొడువు ఉంటుంది. ఒక్కసారి అది రెండు రెక్కలు వాల్సింది అంటే ఆగకుండా వెళ్తుంది. ఇక గుడ్లగూబ కూడా తన దేహ సంరక్షణ కోసం ఒళ్లంతా ముడుచుకుని ఉంటుంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా అలానే ఉంటుంది. భారతీయులు సాధారణంగా గుడ్లగూబలను కీడుకు సంకేతంగా పరిగణిస్తుంటారు.. కానీ జపనీయులు గుడ్లగూబలను అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ రెండు పక్షులను కలిపి బుల్లెట్ ట్రైన్ రూపొందించారు... ఉత్సవానికి జపాన్ తొలినాళ్ళల్లో రూపొందించిన బుల్లెట్ ట్రైన్ ఇలా ఉండేది కాదు. పాత తరం ట్రైన్ కు కొంచెం భిన్నంగా ఉండేది. అయితే లోకానికి భిన్నంగా ఆలోచించే జపనీయులు 1997లో షింకన్ సేన్ 500 సీరిస్ రకంతో బుల్లెట్ ట్రైన్లను రూపొందించారు. ఈ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. అది కూడా 70 డేసిబిల్స్ సౌండ్ తీవ్రతతో మాత్రమే ప్రయాణించేది.

 

ఇలా రూపొందించారు

కింగ్ ఫిషర్ ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది. దేహం దానికి తగ్గట్టుగా ఉంటుంది. అలాగే వేగం కూడా గాలికి వాలుగా ఉంటుంది. గుడ్లగూబ కూడా ప్రతికూల పరిస్థితుల్లో తన దేహాన్ని దగ్గరికి అనుకుంటుంది.. వీటిని దృష్టిలో పెట్టుకొని బుల్లెట్ ట్రైన్ ముందు భాగాన్ని కింగ్ ఫిషర్ ముక్కులాగా రూపొందించారు. అలాగే ట్రైన్ బాడీని గుడ్లగూబ ఆకారంలో తయారు చేశారు. కింగ్ ఫిషర్ నాసిక రంద్రాల మాదిరి రెగ్యులేటర్ క్రాస్ సెక్షన్లు అమర్చారు. ప్రోటో టైపు లను కూడా త్రిభుజాల ఆకృతి మాదిరి రూపొందించారు. అయితే ఇలాంటి ఆకృతిలో ట్రైన్లను రూపొందించిన తర్వాత బాంబాస్టిక్ సమస్య తలెత్తింది. దీనివల్ల ట్రైన్ సొరంగంలోకి ప్రవేశించినప్పుడు గాలి తీవ్రత అధికమైంది. పైగా ఏరో డైనమిక్ వంటి వైవిధ్యాలు ఉత్పన్నమయ్యాయి. దీనివల్ల సమీప ప్రజలు, జంతువులు ఇబ్బంది పడ్డాయి.

 

మరో ఆలోచనతో

లోకానికి భిన్నంగా ఆలోచించే జపనీస్ శాస్త్రవేత్తలు గుడ్లగూబ ఆకృతి మాదిరి ఫాంటోగ్రాఫ్, ప్రోటో టైప్ చేయడం ప్రారంభించారు. అదేవిధంగా కింగ్ ఫిషర్ ప్రాథమిక రెక్కల ఈకలపై ఉండే సెరేషన్లు అవి సులభంగా ఎగిరేందుకు వీలు కల్పిస్తాయి. వీటిని అనుసరించే జపాన్ శాస్త్రవేత్తలు బుల్లెట్ ట్రైన్ వేగం మరింత పెరిగేందుకు ఇలాంటి మార్పులు చేశారు. ఫలితంగా బుల్లెట్ ట్రైన్ వేగం పెరిగింది. దీనికి తోడు రైలు తన శక్తిని ఓవర్ హెడ్ ఎలక్ట్రానిక్ తీగల నుంచి పొందేలా ఫాంటోగ్రాఫ్ లను రూపొందించారు. వీటి మీదుగా గాలివీయడం వల్ల ట్రైన్ వేగం పెరుగుతుంది. ఇక ప్రపంచంలో మొదటిసారి బుల్లెట్ ట్రైన్ జపాన్ ప్రవేశపెట్టింది.

 

తర్వాత చైనా అనుసరించింది. అయితే మనదేశంలో కూడా 2017లో జపాన్ ప్రధాని షింజో అబే ఢిల్లీ, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. భారత ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో... కీలకమైన మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ లను నడపాలని యోచిస్తోంది. దీనివల్ల ట్రైన్ల గరిష్ట వేగం పెరుగుతుంది. ఫలితంగా ప్రయాణ సమయం తగ్గడం వల్ల ప్రయాణికుల నుంచి గణనీయమైన ఆదరణ లభిస్తుందని భారత రైల్వే శాఖ భావిస్తుంది. దేషం మొత్తం ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలంటే 4 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఒక అంచనా. అయితే 2050 వరకు ఈ సౌకర్యాన్ని దేశం మొత్తం అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ కార్యచరణగా పెట్టుకుంది. ఇప్పటికే వందే భారత్ రైళ్ళు నడిచే మార్గాల్లో ట్రాకులను ఆధునికరించింది. కోవిడ్ సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో... ప్రభుత్వం ట్రాకుల మరమ్మతులకు నడుం బిగించింది. దీనివల్ల ఇప్పుడు నడుస్తున్న రైళ్ల గరిష్ట వేగం పెరిగింది.

 

 

 

జపాన్ బుల్లెట్ ట్రైన్ వెనుక అంత కథ ఉందా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *