Top Ad unit 728 × 90

అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడి ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి…!

అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడి ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి…!

 

అమెరికాలో కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కోవడంలో అధ్యక్షుడు ట్రంప్‌ విఫలమయ్యారని అక్కడి పలు వర్గాల నుంచి విమర్శలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సైతం చేరారు. మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్‌ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తన హయాంలో పనిచేసిన సిబ్బందితో శుక్రవారం మాట్లాడిన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌ తొలి జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ ఫ్లిన్‌పై వచ్చిన ఆరోపణల్ని ఎత్తివేయడంపైనా ఒబామా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒబామా తిరిగి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి

 

కొవిడ్‌-19ను ట్రంప్‌ ఎదుర్కొన్న తీరును 'కచ్చితమైన గందరగోళ విపత్తు'గా ఒబామా అభివర్ణించారు. 'ఒబామా అల్యుమినీ అసోసియేషన్‌'లోని మూడు వేల మంది సభ్యులతో మాట్లాడిన ఆయన డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ''స్వార్థం, ఆటవికత, విభజన, ఇతరుల పట్ల శత్రుత్వ భావం వంటి పోకడలు ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయి. అంతర్జాతీయంగానూ ఇదే తీరు కొనసాగుతోంది. ఈ పరిణామాల వల్లే తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చాలా పేలవంగా స్పందిస్తున్నాయి'' అని ఒబామా అభిప్రాయపడ్డారు. మెరగైన ప్రభుత్వాలకు సైతం ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్న అంశమని.. ఇలాంటి తరుణంలో ''నాకేంటి అన్న ధోరణితో సాగుతూ, అందరితో కయ్యాలు పెట్టుకుంటున్న'' పాలకవర్గం ఉండడం విపత్తును మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు.

 

లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి

 

గతంలో ట్రంప్‌ అనేకసార్లు ఒబామా పాలనపై విమర్శలు గుప్పించారు. కానీ, ఒబామా మాత్రం ఏనాడూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. తాజా రాజకీయాలపై వ్యాఖ్యానించిన సందర్భాలూ అరుదే. కానీ, తాజాగా ట్రంప్‌పై విమర్శలు గుప్పించడం, బిడెన్‌కు మద్దతుపలకడం వంటి పరిణామాలు చూస్తుంటే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కనబడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జో బిడెన్‌ను గెలిపించడం కోసం తాను కావాల్సినంత సమయాన్ని వెచ్చిస్తానని ఒబామా తన మద్దతుదారులకు హామీ ఇవ్వడం కొసమెరుపు. ట్రంప్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒబామాను కావాలనే డెమొక్రాట్లు రంగంలోకి దింపారనే వాదన వినిపిస్తోంది.

 

లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి

అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడి ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *