Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

మహనీయుని మాట: ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి: హెలెన్ కెల్లర్ నేటి మంచిమాట: అధికమంది ఆమోదించినంత మాత్రాన అబద్దం నిజంకాదు. తప్పు ఒప్పు కాదు. దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 14, 2020  శుక్రవారం తిధి: దశమి ఉ 10:01 తదుపరి ఏకాదశి నక్షత్రం: మృగశిర రా తె 4:13 తదుపరి ఆరుద్ర యోగం: వ్యాఘాతం ఉ 8:03 కరణం: భద్ర ఉ 10:01 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి: వృషభం సూర్యోదయం:5:59 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: ఉ 10:30 - 12:00 యమగండం: మ 3:00 - 4:30 వర్జ్యం: ఉ 8:45 - 10:26 దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 అమృతకాలం: రా 9:21 - 11:01 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న పాక్ ప్రభుత్వం…!

ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న పాక్ ప్రభుత్వం…!

 

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. కానీ మెజారిటీ కేసుల్లో నిందితులు శిక్షల నుండి తప్పించుకుంటున్నారని ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో శిక్ష పడినా ఆ శిక్ష అమలు విషయంలో జాప్యం జరుగుతోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నేరం రుజువైన పక్షంలో నిందితులను నడిరోడ్డుపై బహిరంగంగా ఉరి తీయాలని పాక్ ప్రభుత్వం తీర్మానించింది. పాక్ పార్లమెంట్ ఈ తీర్మానానికి ఆమోదం తెలిపింది. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ లోని నౌషెరా ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పాక్ అంతటా సంచలనం సృష్టించింది.

రోజురోజుకు చిన్నారులపై అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతూ ఉండటంతో చిన్నారులపై హత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చేయాలనే ఉద్దేశంతో పాక్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలీ మహ్మద్ ఖాన్ ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదంలో పార్లమెంట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత రాజా అష్రాఫ్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో ఉరి తీయాలనే నిర్ణయం సరైన నిర్ణయం కాదని ఈ బిల్లు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. దోషులకు విధించే శిక్షలో తీవ్రత పెరిగినంత మాత్రం నేరాల సంఖ్య తగ్గదని పేర్కొన్నారు. మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి శిరీన్ బజారి మాట్లాడుతూ పార్లమెంట్ లో ఆమోదించిన తీర్మానం పార్టీ నిర్ణయంలా ఉందే తప్ప ప్రభుత్వ నిర్ణయంలా లేదని చెప్పారు. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల మంత్రిత్వ శాఖ ఎట్టి పరిస్థితులలోను అంగీకరించదని అన్నారు.

ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న పాక్ ప్రభుత్వం…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *