Top Ad unit 728 × 90

అమెరికా సైనికులను అంతం చేసేందుకు రష్యా కుట్ర…!

అమెరికా సైనికులను అంతం చేసేందుకు రష్యా కుట్ర…!

 

అఫ్ఘానిస్తాన్‌లోని అమెరికా సైనికులు, ఇతర దేశాల సంయుక్త దళాలను మట్టుపెట్టేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులకు రష్యా మిలటరీ సుపారీ ఇచ్చిందని అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇప్పటికే నివేదిక అందించినట్టు అమెరికా మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్య నిఘా సంస్థలకు నెలల కిందటే ఉప్పందిందని, ఐరోపా దేశాల్లో అమెరికా బలగాలపై జరిగిన దాడుల వెనకా రష్యా మిలిటరీ హస్తం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వార్గాలు తెలిపాయి.

 

ఇందుకు సంబంధించి ఇస్లామిక్ ఉగ్రవాదులు, వారికి అనుబంధంగా ఉన్న వర్గాలకు ఇప్పటికే డబ్బు కూడా అందినట్టు ఆయా వర్గాలను ఊటంకిస్తూ అమెరికా మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఈ విషయంపై శ్వేత శౌథం, అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు.

 

2019లో అమెరికాకు చెందిన 20 మంది సైనికులు ఉగ్రమూకలతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీటిలో ఎన్ని ఘటనలపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోందనేది కూడా ఇంకా తెలియరాలేదు.

 

ఆఫ్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా సేనలను వెనక్కు రప్పించేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాలీబన్లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్‌లో కేవలం 8600 మంది అమెరికా సిబ్బంది మాత్రమే ఉన్నారు. ముందుగా అనుకున్న దానికంటే వేగంగానే సేనల ఉపసంహరణ సాగుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం కూడా దీనికి ఓ కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా సైనికులను అంతం చేసేందుకు రష్యా కుట్ర…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *