Top Ad unit 728 × 90

District News :

పాముల సహాయంతో పరిశోధనలు...!

పాముల సహాయంతో పరిశోధనలు...!

 

ఎన్నో రకాల వ్యాధులకు, వైరస్ లకు మందులు కనిపెట్టే సైంటిస్టులు, ఎన్నో రహస్యాలను వెలికి తీసే పరిశోధకులు పాముల సహాయంతో కొత్త పరిశోధనలకు రెడీ అవుతున్నారు. అదేంటీ పాముల సహాయంతో పరిశోధనలా…? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ, శ్రీరాముడు కూడా ఉడత సహాయం చేసినట్లుగా పరిశోధకులు పాముల సహాయం తీసుకుని సరికొత్త పరిశోధనలకు రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్‌, జపాన్‌ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు…? ఇది కనిపెట్టేందుకే సైంటిస్టులు పాముల సాయం తీసుకోబోతున్నారు.

 

చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో సరిగ్గా 33 ఏళ్ల క్రితం 1986 ఏప్రిల్ 26న కొన్ని సెకన్ల వ్యవధిలోనే పంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం సంభవించింది. దీంతో రేడియోధార్మికత వల్ల 134 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 28 మంది కొన్ని నెలల్లోనే చనిపోయారు. ఆ తర్వాత మరో 19 మంది మరణించారు. అలాగే పుకుషిమా అనురియాక్టర్ ప్రమాదం అంతా ఇంతా కాదు. అటువంటి అణు ప్రమాదాలు కలగజేసే నష్టం మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. రేడియేషన్‌ ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు ఆ ప్రాంతాలను పట్టి పీడిస్తుంది. మొక్క కూడా మొలవని భయంకర పరిస్థితులుంటాయక్కడ. ఇక ప్రాణుల సంగతి చెప్పనే అక్కరలేదు. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్‌, జపాన్‌ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో కళ్లారా చూసి ఉన్నాం. అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు…? ఇది కనిపెట్టేందుకే సైంటిస్టులు పాముల సాయం తీసుకోబోతున్నారు.

 

ఫుకుషిమా సైంటిస్టులు ఈ అరుదైన పరిశోధనలకు సిద్ధపడినట్లు 'ఇచ్‌థైయోలజీ అండ్‌ హెర్పెటోలజీ అనే జర్నల్‌ కథనం ప్రచురించింది. అలాగని పరిశోధకులు పాముల్ని హింసించడం లాంటివి చేయరు. పాముల్ని బయో ఇండికేటర్లుగా ఉపయోగించుకుంటారు. సాధారణంగా మట్టి, గాలి, నీటితో కలిసిఉండే చెట్లను, జీవ రాశులన్నింటినీ బయో ఇండికేటర్లుగానే గుర్తిస్తారు. వీటి జీవన విధానాన్ని పరిశీలిస్తూ, అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు, చెట్ల మీద మొలిచే నాచు, గాల్లో ఉండే విషవాయువుల మోతాదును ఇది సూచిస్తుంది. ఎలాగంటే, గాలిలో ఉండే తేమ నుంచే నాచుకి ఎక్కువ శక్తి లభిస్తుంది. ఒకవేళ గాల్లో గనుక విష వాయువుల ప్రభావం ఎక్కువగా ఉంటే నాచు రంగు మారుతుంది.

 

 

 

ఈ క్రమంలో ఇప్పటి వరకూ మొక్కలను, చెట్లను మాత్రమే బయో ఇండికేటర్లుగా ఉపయోగించిన సైంటిస్టులు, మొదటిసారిగా పాములపై ఈ ప్రయోగం చేస్తు‍న్నారు. పాములను ప్రత్యేకించి జెర్రిపోతు (గొడ్డు) పాములను ఈ ప్రయోగాలకు వాడుకోనున్నారు. ఎందుకంటే, ఇవి ఎక్కువ దూరం ప్రయాణించవు. మట్టితో మమేకమై ఉంటాయి. అలాగే దగ్గర దగ్గరగా జీవిస్తుంటాయి. అందుకే జెర్రిపోతు పాముల్ని సెలక్ట్ చేసుకున్నారు పరిశోధకులు.

 

ఇక ఈ పరిశోధనలో, ఫుకుషిమా పరిధిలో జీవిస్తున్న 1700 పాముల్ని పరిశోధకులు నిరంతరం పర్యవేకక్షించబోతున్నారు. ఆ పాములపై రేడియేషన్‌ ప్రభావం, ఫుకుషిమా ప్రాంతంలో వాటి జీవనవిధానం ఆధారంగా రేడియేషన్‌ లెవల్‌ను అంచనా వేసి లెక్కిస్తారు. ఎప్పుడైతే మట్టిలో రేడియేషన్‌ ప్రభావం తగ్గుతుందో అవి అప్పుడు యాక్టివ్‌గా తిరుగుతుంటాయి. అలా వీటి జీవన విధానాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో రేడియేషన్‌ ప్రభావాన్ని లెక్కగట్టబోతున్నారు. దీనికి సంబంధించిన విషయాలను ప్రొఫెసర్‌ హన్నా గెర్కె వెల్లడించారు. పాముల ట్రాకింగ్‌ కోసం జీపీఎస్‌ వ్యవస్థను ఉపయోగించనున్నారు పరిశోధకులు.

పాముల సహాయంతో పరిశోధనలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *