Top Ad unit 728 × 90

డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు…!

డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు…!

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి అహ్మదాబాద్‌లో జరుగబోయే ఇండియన్ వెర్షన్ ప్రధాని నరేంద్ర మోడీ 'హౌడీ మోడీ' షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్, ఢిల్లీ, అగ్రా ప్రాంతాల్లో ట్రంప్ పర్యటించే అవకాశం ఉంది. అమెరికా అభిశంసన ప్రక్రియ నుంచి గట్టెక్కిన ట్రంప్‌ను యూఎస్ సెనేట్ నిర్దోషిగా ప్రకటించిన అనంతరం ఆయన భారత్‌లో అమెరికా అధ్యక్షుడి హోదాలో పర్యటించనున్నారు.

 

ఫిబ్రవరి 24న ట్రంప్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఢిల్లీలో ట్రంప్ భారత పార్లమెంటుపై ప్రసంగించనున్నారు. అప్పట్లో భారత్ పర్యటించిన అమెరికా అధ్యక్షుల్లో 1959లో డ్వైట్ ఎసెన్ హోయర్, 2000లో బిల్ క్లింటన్, 2010లో బరాక్ ఒబామా మాదిరిగా ట్రంప్ ప్రసంగించనున్నారు.

 

భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలో ట్రంప్, మోడీ ట్రేడ్ డీల్ పై ఒప్పందంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్, అమెరికాల మధ్య డీల్ పై చర్చలు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇరుదేశాల మధ్య చర్చల్లో భాగంగా 3 బిలియన డాలర్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోళ్లపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అపాచీ హెలికాఫ్టర్లు, p8 మారిటైమ్ సర్వెయిలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుపై కూడా చర్చకు రానుంది.

ఢిల్లీలో బస చేసిన తర్వాత ట్రంప్ ఫిబ్రవరి 24న ఆగ్రాకు బయల్దేరనున్నారు. అక్కడి చారిత్రక కట్టడం తాజ్ మహల్‌ను ఆయన సందర్శించనున్నారు. ప్రపంచ నేతలు ఎవరు భారత్ వచ్చినా తిరిగి స్వదేశానికి వెళ్లే ముందు ఈ ప్రాంతాన్ని సందర్శిచి కాని వెళ్లరు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో హౌస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ లో మోడీతో పాటు ట్రంప్ కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి 50వేల మంది వరకు హాజరయ్యారు.

 

అహ్మదాబాద్ ర్యాలీలో ట్రంప్ పాల్గొననున్నారు. ప్రత్యేకించి హౌడీ మోడీ ఈవెంట్ లో మోడీతో పాటు ట్రంప్ ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీలో ట్రంప్.. అమెరికాలోని గుజరాతీల గురించి మాట్లాడనున్నారు. డెమెక్రటిక్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో భారత- అమెరికన్ కమ్యూనిటీని దూరం చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. డెమెక్రటిక్ పార్టీకి ఓటు వేసిన వారిలో భారతీయ అమెరికన్లు ఎక్కువ మంది ఉన్నారు.

 

కానీ, ఇటీవల కాలంలో కొంతశాతం రిపబ్లికన్ పార్టీకి ఓట్లు పడ్డాయి. 2016లో 14 శాతం ఓట్లు రిపబ్లికన్ పార్టీకే ఓట్లు వేశారు. అదే సంవత్సరంలో కమ్యూనిటీ కోసం ట్రంప్ ప్రసంగించారు. యూఎస్ పొలిటికల్ పార్టీ తరపున తొలి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎడిసన్, న్యూజెర్సీలో పొలిటికల్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ భారతీయ అమెరికన్ల కమ్యూనిటీపై పొలిటికల్ ప్రత్యేకంగా ప్రసంగించారు. మరోవైపు ట్రంప్ పర్యటనను భారత్ ఇప్పటివరకూ ప్రకటించలేదు. విదేశే వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ కూడా దీనిపై పూర్తివివరాలను వెల్లడించలేదు.

 

డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *