Top Ad unit 728 × 90

చైనాకు చెక్: భారత్‌కు అండగా అమెరికా బలగాల రాక

చైనాకు చెక్: భారత్‌కు అండగా అమెరికా బలగాల రాక

 

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు దక్షిణాసియాకు చైనా ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలోనే చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా దళాలను తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. గురువారం బ్రస్సెల్ ఫోరం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జర్మనీలో అమెరికా సాయుధ బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారన్న ప్రశ్నకు మైక్ పంపియో బదులిస్తూ, వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.


చైనా సైనిక చర్యలు భారత్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్ దేశాలకూ ముప్పుగా పరిణమించాయి. దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కోవడానికి, చైనా ఆర్మీకి ధీటైన జవాబు ఇవ్వడానికి అమెరికా బలగాలను సరైన రీతిలో మోహరిస్తామని చెప్పారు. అవసరమైన వనరులన్నింటినీ వినియోగిస్తామని మైక్ చెప్పారు.

చైనాకు చెక్: భారత్‌కు అండగా అమెరికా బలగాల రాక Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *