Top Ad unit 728 × 90

ఉత్తర కొరియా సరిహద్దుల్లో... లౌడ్‌స్పీకర్ల మోత!

ఉత్తర కొరియా సరిహద్దుల్లో... లౌడ్‌స్పీకర్ల మోత!

 

సియోల్‌: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా టీవల వెయ్యికిపైగా బెలూన్ల ద్వారా దక్షిణ కొరియా లోకి చెత్త, మురికి మట్టిని జారవిడిచిన విషయం తెలిసిందే.

 

దీన్ని సియోల్‌ ఇప్పటికే ఖండించింది. ఈ క్రమంలోనే మరోసారి బెలూన్లు కనిపించాయి. దీంతో ఉత్తర కొరియా సరిహద్దుల్లో లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేసి ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభించింది. ఉత్తర కొరియన్లకు విదేశీ రేడియో, టీవీ ప్రసారాలు అందవు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంది. దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

 

ఈ వ్యవహారంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శక్తిమంతమైన సోదరి కిమ్‌ యో జోంగ్‌ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ ర్యలకు తక్షణమే అడ్డుకట్టవేయకపోతే ఇదివరకు చూడని విధంగా స్పందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా... సియోల్‌ గతంలోనూ ప్యాంగ్‌యాంగ్‌ వ్యతిరేక ప్రసారాలు, కే-పాప్ పాటలు, అంతర్జాతీయ వార్తలను వినిపించేందుకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించింది. 2015లోనూ ఇలాగే చేయగా... కిమ్‌ సర్కారు ఫిరంగి గుండ్లు పేల్చింది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులే ఎదురైతే దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.

 

ఉత్తర కొరియా సరిహద్దుల్లో... లౌడ్‌స్పీకర్ల మోత! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *