Top Ad unit 728 × 90

అంత డబ్బులు ఎలా సంపాదించడనేది మాత్రం రహాస్యమే…!

అంత డబ్బులు ఎలా సంపాదించడనేది మాత్రం రహాస్యమే…!

 

నెల జీతం మీద ఆధారపడే ఉద్యోగి ఉన్నట్టుండి కోట్లు విలువ చేసే కారు కొనడంతో, కంపెనీ యాజమాన్యం ఆరా తీయగా నిందితుడి గుట్టు బయటపడింది. వివరంగా చెప్పాలంటే, ఒమన్‌కు చెందిన నిందితుడు దుబాయిలోని టెలికమ్యూనికేషన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీలో నిందితుడు చేయాల్సిన పనేంటంటే, కస్టమర్ల నుంచి డ్యామేజ్ అయిన రీచార్జ్ స్క్రాచ్ కార్డ్స్‌ను తీసుకుని వారికి వేరే స్క్రాచ్ కార్డ్‌లను ఇవ్వడం. అనంతరం రిటర్న్ వచ్చిన కార్డ్‌ల నెంబర్లను సిస్టమ్‌లో నమోదు చేసి వాటి డేటాను పూర్తిగా తీసేయడం నిందితుడు చేయాల్సిన పని.

 

 భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

 

వేరే ఏ బ్రాంచ్‌కు రానన్ని డ్యామేజ్ స్క్రాచ్ కార్డ్‌లు నిందితుడ పనిచేస్తున్న బ్రాంచ్‌కు వచ్చాయి. పైగా డ్యామేజ్ స్క్రాచ్ కార్డ్‌ల డేటాను సైతం నిందితుడు సిస్టమ్ నుంచి డిలీట్ చేయలేదు. ఇలా 2015 నుంచి 2018 మధ్య నిందితుడు ఆ డ్యామేజ్ కార్డ్‌ల ద్వారా 14.7 మిలియన్ దిర్హామ్‌ (రూ.28 కోట్ల 50 లక్షలు) లు సంపాదించాడు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం ఒక్కసారిగా కంగుతింది. అయితే డ్యామేజ్ స్క్రాచ్ కార్డుల ద్వారా నిందితుడు డబ్బులు ఎలా సంపాదించడనేది మాత్రం కంపెనీ యాజమాన్యానికి అర్థం కావడం లేదు. నిందితుడి నెల జీతం 17196 దిర్హామ్‌ (రూ.3 లక్షల 33 వేలు) లు అని, ఉన్నట్టుండి కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్, బెంట్లీ కారులో ఆఫీసుకు వస్తుండటంతో తమకు సందేహం వచ్చిందని యాజమాన్యం తెలిపింది. నిందితుడు చేతికి సైతం లక్ష దిర్హామ్‌ల రోలెక్స్ వాచ్ పెట్టినట్టు యాజమాన్యం చెప్పింది. కాగా, నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడి నుంచి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

 

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అంత డబ్బులు ఎలా సంపాదించడనేది మాత్రం రహాస్యమే…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *