Top Ad unit 728 × 90

District News :

నర్సింగ్‌, డిప్లొమో చేసిన వారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు…!

నర్సింగ్‌, డిప్లొమో చేసిన వారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు…!

 

నర్సింగ్‌, డిప్లొమో చేసిన వారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్రప్రభుత్వ విదేశీ ఉద్యోగావకాశాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంగ్లాండ్‌లో ఉన్న ఆస్పత్రులకు డిప్లొమో, డిగ్రీ చేసిన 300 నుంచి 500 మంది అవసరమవుతున్నారు. వీరికి నెలకు రూ.2 నుంచి రూ.2.50 లక్షల వరకు జీతం ఇస్తారు. కువైట్‌ దేశంలో పనిచేసేందుకు టెన్త్‌ ఉత్తీర్ణులై 30 నుంచి 43 ఏళ్లలోపున్న వారు డ్రైవర్‌ పోస్టులకు అర్హులు. వీరికి నెలకు రూ.27 వేల నుంచి రూ.34,500 వేతనం అందజేస్తారు. అరబ్‌ దేశంలో కుక్‌ పోస్టులకు 30 నుంచి 40 ఏళ్లలోపున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వంట మనుషులకు రూ.37 వేలు, ఇంటి పని చేసే వారికి రూ.29,640 నుంచి రూ.32 వేలు వేతనం అందజేస్తారు. డిప్లొమో, ఇంజనీరింగ్‌ (మెకానికల్‌), ఐటీఐ ఫిట్టర్‌ కోర్సులు పూర్తిచేసి 22 నుంచి 35 ఏళ్లలోపున్న వారి ఓమన్‌ దేశంలో ఉద్యోగావకాశాలు న్నాయని, వీరికి వేతనంగా రూ.29 వేలు అందజేయ నున్నారు. అలాగే, వీరికి వేతనంతో పాటు బస, భోజనం, విమాన టిక్కెట్లు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన వారు www.omcmanpower.com అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నర్సింగ్‌, డిప్లొమో చేసిన వారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *