Top Ad unit 728 × 90

ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం: స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా

ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం: స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా

 

నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కాలంలో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 444 స్పెషలిస్ట్ ఆఫీసర్లకు సంబంధించిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

 

అయితే, ఈ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్షలు అవసరం లేదని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ పేర్కొన్నది. దరఖాస్తు సమయంలో రెజ్యుమ్ తో పాటుగా వయస్సు, గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలు, అనుభవంకు సంబంధించిన సర్టిఫికెట్స్ ను అప్ లోడ్ చేయాలని పేర్కొన్నది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగం లభిస్తుందని ఎస్బీఐ తెలిపింది.

ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం: స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *