Top Ad unit 728 × 90

మటన్ తిననందుకు భర్తపై...!

మటన్ తిననందుకు భర్తపై...!

 

కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కొందరికి ముక్కంటనే పడదు. ఇలా రకరకాల ఆహారపు అలవాట్లు మనలో చాలామందికి ఉంటాయి. నాన్‌వెజ్ అంటే ఇష్టపడని వాళ్లు కూడా ఉంటారు. వారు పూర్తిగా వెజ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ వెజ్ నాన్ వెజ్ గొడవ, ఓ కొత్త జంట కాపురంలో చిచ్చు పెట్టింది. నాన్ వెజ్ తింటేనే కాపురం చేస్తానంటూ ఓ భార్య భర్తతో పేచీకి దిగింది. మటన్ తింటావా, లేదా…? నాన్ వెజ్ తింటేనే నీతో కాపురం చేస్తా, లేదంటే లేదు అంటూ ఓ భార్య భర్తతో పేచీ పెట్టింది.

 

నాకు ఇష్టం లేదు, నేను తినను అన్నా కూడా భార్య వినలేదు. మటన్ తిననందుకు భర్తపై అలిగి పెళ్లైన ఆరునెలలకే పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చివరికి భార్య భర్తల మధ్య పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ రహ్మత్‌నగర్‌కు చెందిన యువతి సైదాబాద్‌కు చెందిన యువకుడు ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 

ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అయినప్పటికీ కూడా భర్త కుటుంబ సభ్యులు పూర్తిగా వెజిటేరియన్స్. వారింట్లో ఎవరూ నాన్ వెజ్ తినరు. ఇంట్లో వండరు కూడా. దీంతో పెళ్లికి ముందే అతడు తనకు నాన్ వెజ్ ఇష్టం ఉండదని, తిననని చెప్పాడు. ఒకవేళ ఆమెకు తినాలనిపిస్తే బయట నుంచి తెచ్చుకోవాలన్నాడు. ఇంట్లో మాత్రం వండే ప్రసక్తే లేదని చెప్పాడు. దీంతో అన్నింటికి ఆమె ఒప్పుకుంది. పెళ్లి అయ్యింది. నాలుగునెలల పాటు వారి కాపురం సజావుగా సాగంది. తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఇంట్లో మటన్ వండి తీరాలని ఆమె పట్టుబట్టింది.

దీనికి అతడి ఫ్యామిలీ ఏ మాత్రం ఒప్పుకోలేదు. భర్తను కూడా మటన్ ముక్క తినాలని ఆమె ఒత్తిడి చేసింది. అతడు అందుకు నో అన్నాడు. దీంతో మాట వినని భర్త తనకు వద్దంటూ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. అంతటితో ఆగకుండా భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భార్యభర్తల మధ్య మనస్పర్థలకు మటన్ ముక్క కారణమని తెలిసి షాక్ తిన్నారు. ఆహారపు అలవాట్ల విషయంలో నెలకొన్న అభిప్రాయ బేధాలతో దంపతులు విడిపోవడం ఏంటని పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చచెప్పారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు భార్యభర్తల్ని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మటన్ తిననందుకు భర్తపై...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *