Top Ad unit 728 × 90

ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ... వీడియో

ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ... వీడియో

 

ప్రస్తుతం మన దేశం భయంకరమైన ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోంది. మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి (Heat wave). దక్షిణ భారతదేశం ఇటీవల కొంత చల్లబడినప్పటికీ, ఉత్తరాదిన ఇప్పటికీ 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో ఎండ వేడి గురించి పలువురు వ్యక్తులు రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ ఎండ వేడికి స్టవ్ అవసరం లేదంటూ ఆరు బయట వంటలు చేసి వీడియోలు రూపొందించారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

tejalmodi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ రోడ్డును నీటితో క్లీన్ చేసింది. ఎర్రటి ఎండలో రోడ్డుకు నూనె రాసింది. అనంతరం రెండు గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్‌లా వేసింది. ఆ వీడియోలో తయారైన ఆమ్లెట్‌ను చూపించనప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 80 లక్షల మందికి పైగా వీక్షించారు

 

ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ... వీడియో Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *