ఏదో చేయాలని చూస్తే... చివరకు ఏమైందో చూడండి.
అత్యుత్సాహానికి పోతే ఇలాగే జరుగుతుందేమో... ఏదో చేయాలని చూస్తే... చివరకు ఏమైందో చూడండి.
సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం చాలా మంది యువత ప్రాణాలకు తెగిస్తున్నారు. కొందరైతే అందరి ముందూ హీరోలు అనిపించుకోవాలనే అత్యుత్సాహంతో పిచ్చి పిచ్చి పనుల చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు అత్యుత్సాహానికి పోయి చేసిన విన్యాసం చివరకు బెడిసికొట్టింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రీల్స్ వీడియోలు చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఓ నడి ఒడ్డున ఇసుకలో స్టంట్స్ చేయడానికి వెళ్లాడు. తన స్నేహితులు కెమెరా ఆన్ చేయగానే దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి... ఇసుకలో పల్టీలు కొట్టి మళ్లీ స్టండీగా నిలబడాలి.
అనుకున్నట్లుగానే ఎదురుగా ఉన్న స్నేహితుడు ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టుకున్నాడు. మరో వ్యక్తి గమనిస్తుండగా... సదరు యువకుడు దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి గోతిలో ఒక్కసారిగా పల్టీలు కొట్టాడు. అయితే గాల్లో ఒక రౌండ్ పల్టీలు కొట్టి రెండో రౌండ్ కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నేలకు తన తల తాకింది. మెడ గట్టిగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. శ్వాస తీసుకోవాడానికి కూడా ఇబ్బంది కావడంతో ముందుకు బోర్లా పడుకున్నాడు. ఈ ఘటనతో అతడి స్నేహితులంతా షాక్ అయ్యారు.
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ప్రమాదం చూస్తుంటే అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''అయ్యో… పాపం... ఇలా జరిగిందేంటీ''... అంటూ కొందరు, ''అతడికి ఏమీ కాకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నాం''... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.