Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

రూ15 వేల లోపు జీతం ఉన్న వారికి మోదీ శుభవార్త...!

రూ15 వేల లోపు జీతం ఉన్న వారికి మోదీ శుభవార్త...!

 

 

మీరు నెలకు రూ.15,000లోపు సంపాదిస్తున్నారా? ఇప్పటికీ కూడా రిటైర్మెంట్ గురించి ఇంకా ప్లాన్ చేయలేదా? అయినా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది. 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరితే ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. అంటే సంవత్సరానికి రూ.36,000 పొందొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ స్కీమ్ పేరు పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ యోజన. ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరిన వారు నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్యలో ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ వయసు ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం కూడా మారుతుంది. 18 ఏళ్ల వయసులోనే ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. అదే మీరు 30 ఏళ్ల వయసులో పథకంలో చేరితే అప్పుడు మీరు రూ.100 చెల్లిస్తూ రావాలి. అలాగే 40 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.200 కట్టాలి.
 

ఇళా 60 ఏళ్ల వచ్చే వరకు చెల్లించాలి. తర్వాత మీకు ప్రతి నెలా రూ.3,000 లభిస్తాయి. మీరు 18 ఏళ్లలో ఈ స్కీమ్‌లో చేరితే మీరు మొత్తంగా రూ.27,720 చెల్లిస్తారు. 60 ఏళ్ల తర్వాతి నుంచి మీరు జీవించి ఉన్నంత కాలం మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది.ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరాలని భావించే వారు సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి స్కీమ్‌లో చేరొచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్ అకౌంట్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు శ్రమ యోగి కార్డు కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈఎస్ఐ స్కీమ్స్‌లో ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి వీలు లేదు.

రూ15 వేల లోపు జీతం ఉన్న వారికి మోదీ శుభవార్త...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *