Top Ad unit 728 × 90

వీరి ఆచూకీ తెలిపితే తల ఒక్కంటికి కోటి బహుమతి…!

వీరి ఆచూకీ తెలిపితే తల ఒక్కంటికి కోటి బహుమతి…!

 

ప్రముఖ నక్సలైట్‌ నేతల ఆచూకీ తెలిపితే నగదు బహుమతులు ఇస్తామని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై శనివారం పలుచోట్ల వారి ఫొటోలతో ముద్రించిన గోడపత్రికలను అతికించింది. ఇద్దరు మహిళలు సహా 34 మంది నాయకుల వివరాలను ఇందులో ప్రచురించింది. స్థాయిని అనుసరించి రూ.కోటి నుంచి రూ.8 లక్షల వరకు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. నలుగురు అగ్రనేతల వివరాలు చెబితే కోటి రూపాయలు చొప్పున బహూకరించనున్నట్టు పేర్కొంది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్‌ గంగన్న అలియస్‌ బసవరాజు, పొలిట్‌బ్యూరో సభ్యులు ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతిలపై ఈ రూ.కోటి రివార్డు ఉన్నట్టు బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ చెప్పారు. మరో తొమ్మిది మందిపై రూ.40 లక్షల చొప్పున, 17 మందిపై రూ.25 లక్షల చొప్పున రివార్డు ఉందని వివరించారు. ఆచూకీ చెప్పిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ వివరాలను సామాజిక మాధ్యమాల్లో కూడా ఉంచుతామని చెప్పారు.

వీరి ఆచూకీ తెలిపితే తల ఒక్కంటికి కోటి బహుమతి…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *