Top Ad unit 728 × 90

దర్భంగా పేలుడుకు హైదరాబాద్‌తో ఉన్నలింక్ ఏమిటి...!

దర్భంగా పేలుడుకు హైదరాబాద్‌తో ఉన్నలింక్ ఏమిటి...!

 

దర్భంగా పేలుడుకు హైదరాబాద్‌తో లింక్ ఉందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌ను బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులిద్దరు అన్నాదమ్ముళ్లు. వీరికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. నిందితుల స్వస్థలం యూపీలోని షామ్లీ జిల్లా ఖైరాన. నాసిర్ మాలిక్ 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి మల్లేపల్లి ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. హబీబ్‌నగర్‌లోని మసీదు వద్ద బట్టల షాపు నడుపుతున్నారు. ఐతే బీహార్‌లోని దర్భంగాలో పేలుడు జరగడంతో వీరి ఉగ్రలింకులు బయటపడ్డాయి.

హైదరాబాద్‌లోని తమ దుకాణం అడ్రెస్‌తోనే నిందితులు పార్సిల్ బుకింగ్ చేసినట్లు తెలిసింది. బట్టల పార్సిల్‌లో పేలుడు పదార్థాలను ఉంచి సికింద్రాబాద్- దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో పంపించారు. వస్త్రాలలో బాంబులు పెట్టి పేల్చాలని, ఆ మంటలతో కదులుతున్న రైలును పూర్తిగా దగ్ధం చేయాలన్నది వీరి ప్రణాళిక. అనుకున్నట్లుగానే నాసిర్ స్థానికంగా దొరికిన రసాయనాలను ఉపయోగించి బాంబు తయారు చేశారు. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, షుగర్ ఉపయోగించి ఓ 50 ఎంఎల్ మెడిసిన్ బాటిల్‌లో బాంబును సిద్ధం చేశాడు. దానిని ఓ రెడీమేడ్ క్లాత్‌లో ఉంచి రైలులో పార్సిల్ పంపించారు. సరిగ్గా 16 గంటల తర్వాత బాంబు పేలేలా టైమర్ సెట్ చేశారు. కానీ లిక్విడ్ లీకేజీ వల్ల ఆ బాంబు రైల్లో పేలలేదు. జూన్ 17న పార్సిల్‌ను రైలు నుంచి బయటకు తీసి, ఒకటో నెంబర్ ప్లాట్‌పామ్‌పై ఉంచిన తర్వాత పేలింది. లీకేజీ కారణంగా తక్కువ తీవ్రతతో పేలడంతో పెను ప్రమాదం తప్పింది.

మొదట దర్భంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జూన్ 24న ఎన్ఐఏ కేసును టేకప్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్ నుంచే పార్సిల్ వచ్చినట్లు గుర్తించారు. జూన్ 15న ఎండీ సూఫియాన్ పేరుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్సిల్ బుక్ చేశారు. ఇక్కడే జాగ్రత్తగా వ్యవహరించారు నిందితులు. పార్సిల్ బుక్ చేసే సమయంలో నకిలీ ఐడెండిటీ కార్డులను సమర్పించారు. కానీ వీరి ప్లాన్ బెడిసి కొట్టింది. రైల్వే పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సహకారంతో ఎన్ఐఏ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

నిందితుల్లో ఒకడైన నాసిర్ మాలిక్ 2012లో పాకిస్తాన్‌కు వెళ్లాడని విచారణలో తేలింది. అందుబాటులో ఉండే రసాయనాలతో బాంబులను ఎలా తయారు చేయాలో లష్కరే తోయిబా ఇతడికి శిక్షణ ఇచ్చింది. నాసిర్ గార్మెంట్ షాపు నడుపుకుంటూనే నిఘా వ్యవస్థకు దొరకకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపేవాడు. ఆన్‌లైన్ వీడియోల ద్వారా కూడా బాంబు తయారీ శిక్షణ పొందాడు. ఇక నాసిర్ మాలిక్ సోదరుడు ఇమ్రాన్ గత ఏడాదే హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిసింది. వీరంతా మల్లేపల్లిలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు వెల్లడించారు. వారు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు, పలు కీలక ఆధారాలు సేకరించారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం పాట్నాకు తరలించారు. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. వీరికి హైదరాబాద్‌లో ఇంకెవరైనా సహకరించారా? దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

 

దర్భంగా పేలుడుకు హైదరాబాద్‌తో ఉన్నలింక్ ఏమిటి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *