Top Ad unit 728 × 90

రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ

రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ

 

దేశంలోని రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెరకు కొనుగోలు ధరల పెంపుదలకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించిన నేపధ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

 

ఈ పెంపుదలతో కోట్లాది మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

 

చక్కెర సీజన్ 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) కోసం చక్కెర మిల్లులు చెల్లించాల్సిన చెరకు 'న్యాయమైన, లాభదాయక ధర' (ఈఆర్‌పీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో చెరకు ఎఫ్‌ఆర్‌పి క్వింటాల్‌కు రూ. 340 ప్రాథమిక రికవరీ రేటు 10.25 శాతంగా నిర్ణయించారు. 10.25% కంటే ఎక్కువ రికవరీలో ప్రతి 0.1% పెరుగుదలకు, క్వింటాల్‌కు రూ. 3.32 ప్రీమియం అందించనున్నారు. ఇదేకాకుండా 9.5 శాతం లేదా అంతకంటే తక్కువ రికవరీ కలిగిన చక్కెర మిల్లులకు ఎఫ్‌ఆర్‌పి క్వింటాల్‌కు రూ.315.10గా నిర్ణయించారు. కొత్త రేట్లు 2024, అక్టోబర్ 1 నుండి వర్తించనున్నాయి.

 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొత్త రేట్లకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు ఎఫ్‌ఆర్‌పి కంటే ఇది 8 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లబ్ధి చేకూరనుంది.

 

రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *