Top Ad unit 728 × 90

తన 11 ఏళ్ల కూతురుపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిన ఓ తండ్రి...!

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి. కామవాంఛ తీర్చుకోవడం కోసం చిన్న పిల్లల నుంచి ముసలివాళ్లను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా గుజరాత్ లో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి తన 11 ఏళ్ల కూతురుపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తన భార్య ఊరికి వెళ్లిన సమయంలో దారుణానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు బతుకుదెరువు కోసం గుజరాత్ రాష్ట్రానికి వెళ్లారు. గుజరాత్ లోని జామ్నగర్ జిల్లాలోని తలానాలో కొన్నేళ్లుగా వలస జీవనం సాగిస్తున్నారు. దంపతులకు 11 ఏళ్ల బాలిక ఉంది. నెల 1 తేదీన బాలిక తల్లి పనిపై వారి సొంత ప్రాంతం మధ్యప్రదేశ్ కు వెళ్లింది. అయితే కూతురుపైనే కన్నేసిన కీచక తండ్రి, సమయాన్ని అదునుగా మార్చుకున్నాడు. చిన్నారిపై రెండు సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కన్నతండ్రి ఆమెపై అఘాయిత్యం చేయడంతో షాక్ కు గురైన బాలిక డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. అయితే కొన్ని రోజుల తరువాత ఇంటికి వచ్చిన తల్లి కూతురు ప్రవర్తనలో మార్పుని గమనించింది. క్రమంలో ఏం జరిగిందని కూతురును ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం మొత్తం తల్లికి చెప్పింది. దీంతో బాధిత చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

తన 11 ఏళ్ల కూతురుపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిన ఓ తండ్రి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *