Top Ad unit 728 × 90

వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

 

దిల్లీ: హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.30.50 తగ్గి రూ.1,764.50కు చేరింది.

 

రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. పట్నాలో గరిష్ఠంగా ఒక్కో సిలిండర్‌పై రూ.33 వరకు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1,994.50కు, విశాఖపట్నంలో రూ.32 తగ్గి రూ.1,826.50కు చేరింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పీజీ ధరను సైతం రూ.7.50 తగ్గించారు.

 

మార్చి 1న వాణిజ్య వంటగ్యాస్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో సిలిండర్‌పై రూ.25 మేర పెంచాయి. ప్రతినెలా 1వ తేదీన గ్యాస్‌ ధరలను కంపెనీలు సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా మార్పులు చేస్తుంటాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ముందు తగ్గింపు నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *