Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కరోనాతో వినికిడి లోపం బ్రిటన్‌లో వెలుగు చూసిన కేసు...!

కరోనాతో వినికిడి లోపం బ్రిటన్లో వెలుగు చూసిన కేసు...!

 

కరోనా వ్యాధి గురించి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు రోజుకొక కొత్త విషయాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా కరోనా ప్రభావం బాధితులపై విధంగా ఉంటుందనే దానిపై కొత్త అంశాన్ని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో వినికిడి శక్తి తగ్గడం లేదా పూర్తిగా కోల్పోవడం జరిగే అవకాశాలున్నాయని బ్రిటన్లోని యూనివర్శిటీ కాలేజీ లండన్ పరిశోధకులు తేల్చిచెప్పారు. కరోనా సోకిన తరువాత స్టెరాయిడ్ ఔషధాలు ఇచ్చిన అనంతరం వాటి ప్రభావం విపరీతంగా ఉంటుందన్నారు. బాధితులు వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఫ్లూ తదితర వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినపుడు కూడా ఇలా జరుగుతుందని వారు పేర్కొన్నారు. బీఎంజే జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తి కరోనా లక్షణాలలో ఆసుపత్రిలో చేరాడు. 10 రోజుల తరువాత చికిత్సలో భాగంగా అతనిని ఐసీయూకు తరలించాల్సి వచ్చింది. బాధితుడు 30 రోజుల పాటు చికిత్స పొందాడు. తరువాత బాధితునిలో ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించాయి. దీంతో బాధితునికి యాంటీవైరల్ డ్రగ్ రెమెడెసెవిర్, స్టెరాయిడ్స్ ఇచ్చారు. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేశారు. విధమైన చికిత్సల అనంతరం బాధితుడు వ్యాధి నుంచి కోలుకున్నాడు. అయితే కొద్ది రోజుల తరువాత తనకు చెవిలో గంట మోగుతున్న శబ్ధం వినిపించిందని, తరువాత వినికిడి శక్తి కోల్పోయానని బాధితుడు వైద్యులకు ఫిర్యాదు చేశాడు. బాధితుణ్ణి పరిశీలించిన వైద్యులు గతంలో బాధితునికి వినికిడి లోపం లాంటి సమస్యలేవీ లేవని తేల్చిచెప్పారు. కాగా పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుని చెవులకు వైద్య పరీక్షలు చేయగా, లోపలి భాగంలో వాపు కనిపించింది. దీనిని గుర్తించాక బాధితునికి పలు టెస్టులు చేశారు. టెస్టులు వలన కూడా వినికిడి శక్తి కోల్పోవడానికి కారణాలు తేలలేదు. దీంతో పరిశోధకులు బాధితునికి వినికిడి శక్తి కోల్పోవడానికి కరోనానే కారణమని భావిస్తున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు సాగించాల్సివుందని వారు చెబుతున్నారు.

కరోనాతో వినికిడి లోపం బ్రిటన్‌లో వెలుగు చూసిన కేసు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *