Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ప్రారంభమైన ఐదో విడత వందే భారత్ మిషన్ 23 దేశాలకు ప్రత్యేక విమానాలు...!

ప్రారంభమైన ఐదో విడత వందే భారత్ మిషన్ 23 దేశాలకు ప్రత్యేక విమానాలు...!

 

 

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన ఈ రోజు (ఆగస్ట్ 1) నుంచి ఐదో విడత 'వందే భారత్ మిషన్' ప్రారంభమైందన్నారు. ఆగస్ట్ 31 వరకు 'వందే భారత్ మిషన్' 5వ దశ కొనసాగుతుందని వెల్లడించారు. ఐదో విడత 'వందే భారత్ మిషన్'లో భాగంగా గల్ఫ్ దేశాలు, అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, ఫిలిప్పిన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, చైనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాగా 'వందే భారత్ మిషన్'లో భాగంగా ఇప్పటి వరకు 8.45లక్షల మందిపైగా భారతీయులు ఇండియాకు చేరుకున్నట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ విమానాల్లో 2.67లక్షల మంది భారత్ చేరుకోగా చార్టెడ్ విమానాల్లో 4.86లక్షల మంది ఇండియాకు వచ్చినట్లు వెల్లడించారు. నేపాల్, పాకిస్థాన్, భూటన్ తదితర దేశాల్లో చిక్కుకున్న భారతీయులు రోడ్డు మార్గం ద్వారా స్వదేశానికి వచ్చినట్లు వివరించారు.

ప్రారంభమైన ఐదో విడత వందే భారత్ మిషన్ 23 దేశాలకు ప్రత్యేక విమానాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *