Top Ad unit 728 × 90

దేశానికి సేవ చేయాలనే ఆశయం మీలో ఉందా…?

దేశానికి సేవ చేయాలనే ఆశయం మీలో ఉందా…?

 

దేశానికి సేవ చేయాలనే ఆశయం మీలో ఉందా…? అయితే ఇది మీకోసమే. పౌరులకు మూడేళ్ల 'టూర్ ఆఫ్ డ్యూటీ' కింద మీకు దేశానికి సేవ చేసే అవకాశం కల్పించేందుకు భారత సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఈ టూర్ అఫ్ డ్యూటీతో అధికారుల కొరత తీరుతుందని భావిస్తోంది. ఇప్పటికే మూడేళ్ల టూర్ ఆఫ్ డ్యూటీని అనుమతించే ప్రతిపాదనపై చర్చిస్తున్నామని భారత ఆర్మీ వర్గాలు ఓ మీడియా సంస్థకు తెలిపాయి.


అత్యుత్తమ ప్రతిభగల పౌరులను సైన్యంలోకి తీసుకునే విషయమై ఆలోచిస్తోంది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఒక వ్యక్తి గరిష్ఠంగా పదేళ్ల పాటు పని చేయగలడు. స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్ 2019 రిపోర్ట్ ప్రకారం.. భారత సైన్యం ఆఫీసర్ కేడర్ కేవలం 14శాతం మాత్రమే ఉంది. ఆర్మీలో 42,4253 మంది అధికారులు, 11.94 లక్షల జవాన్లు ఉన్నారు. నావికాదళంలో 10 వేల మంది అధికారులు, 57,310 మంది సిబ్బంది ఉన్నారు.

 

యువతను మరింత ఆకర్షించేందుకు ఆర్మీలో ఉన్నతాధికారులు షార్ట్ సర్వీస్ కమిషన్‌ను సమీక్షిస్తున్నారని సమాచారం. మొదట్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఐదేళ్ల కనీస సర్వీస్‌తో ప్రారంభించబడింది. అయితే తర్వాత దానిని 10 ఏళ్లకు పొడిగించారు. జవాన్ల పదవీ విరమణ వయస్సు పెంచేందుకు సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు, భారత వైమానిక దళం, భారత నావికాదళ సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంచాలని మరోసారి కోరారు.

 

అయితే సాయుధ దళ సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంచాలని వాదించగా, దీనిపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మాట్లాడుతూ… శిక్షణ పొందిన ఆర్మీ జవాను 15 ఏళ్ల సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేస్తున్నారని, దీనివల్ల ట్రైనింగ్ పొందిన సిబ్బందిని భారీగా కోల్పోతామన్నారు. ఒక వేళ పదవీ విరమణ వయస్సు పెంచే ప్రతిపాదన కొనసాగితే, మూడు దళాలకు చెందిన 15 లక్షల మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

 

దేశానికి సేవ చేయాలనే ఆశయం మీలో ఉందా…? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *