పతంగులు ఎగురవేయాలంటే లైసెన్స్ తప్పనిసరి, అది ఎక్కడో కాదు...!
పతంగులు ఎగురవేయాలంటే లైసెన్స్ తప్పనిసరి, అది ఎక్కడో కాదు...!
సంక్రాంతి వేళ దేశం అంతటా గాలిపటాల సందడి నెలకొంది. సంక్రాంతికి వారం ముందు నుంచీ ఎక్కడ చూసినా పంతంగుల కోలాహలమే కనిపిస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతి ఒక్క ఆంధ్ర, తెలంగాణలోనే కాదు అన్నిచోట్లా జరుపుకుంటారు. కానీ వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అంతే, మిగతా అంతా సేమ్ టూ సేమ్. ఈ పండగ వేళ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ పతంగులు ఎగురవేస్తారు. పట్టణాల్లో డాబాలపైకి ఎక్కడి కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకుంటారు. గాల్లో ఎక్కడ చూసినా పతంగుల విహారమే కనిపిస్తుంది. కానీ పతంగుల గురించి ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా...? మన దేశంలో గాలిపటం ఎగరువేయాలంటే లెసెన్స్ తప్పనిసరి. అనుమతి లేకుండా పతంగి ఎగురవేయడం చట్టరిత్యా నేరం.
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934-2 (1) ప్రకారం. గాల్లోకి ఏ వస్తువు ఎగురవేయాలన్నా అనుమతి తప్పనిసరి. గాల్లోకి ఎగిరే వస్తువులను తయారు చేయాలన్నా, మరమ్మతులు చేయాలన్నా, గాల్లోకి ఎగురవేయాలన్నా లైసెన్స్ ఉండాలి. విమానాలు, డ్రోన్లతో పాటు గాలిపటాలు, బెలూన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు నేరం రుజువైతే రెండేళ్ల శిక్ష కూడా పడుతుంది. గత ఏడాది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్‌కు సవరణ చేశారు. దాని ప్రకారం విమానాల్లో పేలుడు పదార్థాలు తరలిస్తే కోటి వరకు జరిమానా విధిస్తారు. కానీ పతంగులకు సంబంధించి ఎలాంటి సవరణలు చేయలేదు. అంటే అనుమతి లేకుండా పతంగులు ఎగురవేయడం ఇప్పటికీ నేరమే. విమానాలు నడిపేందుకు ఎలాగైతే అనుమతులు తీసుకోవాలో పతంగులను ఎగురవేసేందుకు కూడా అనుమతి తప్పనిసరి. మరోవైపు దేశంలో పతంగులు ఎగురవేసే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గాలిపటాలకు కట్టే మాంజాతో ఏటా ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. మాంజాలు పక్షుల గొంతుకు చుట్టుకొని, ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రతి పండక్కి పక్షులను బలితీసుకుంటున్నాయి. కేవలం పక్షలే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో మెడకు మాంజా చుట్టుకొని ఓ యువకుడు మరణించాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో మాంజా తగిలి, గొంతు తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఇక డాబాలపై గాలిపటాలు ఎగురవేసే క్రమంలో ఎంతో ప్రమాదవశాత్తు కింద పడిపోయి మరణిస్తున్నారు. అందుకే గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
