Top Ad unit 728 × 90

మోదీయే ప్రధాన ప్రచారకుడు!

మోదీయే ప్రధాన ప్రచారకుడు!

 

గుజరాత్‌లో ప్రధాని సుడిగాలి పర్యటనలు

 

గుజరాత్‌లో ఏడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీయే ప్రధాన ప్రచారకుడిగా రంగంలోకి దిగారు.

 

182 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో ఒక్కో సీటులో ఏ విధంగా గెలవాలన్న వ్యూహం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేస్తుండగా, బీజేపీకి అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని మార్చే బాధ్యతను మోదీ చేపట్టారు. ఆయన రాష్ట్రంలోని వల్సాడ్‌, సోమనాథ్‌, అమ్రేలీల్లో 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక్క సోమవారం నాడే ఆయన మూడు ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రచార ఘట్టం పూర్తయ్యేలోపు మోదీ మరో 30 ర్యాలీలు, రోడ్‌ షోల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

మోదీ తర్వాత ప్రధానంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న అమిత్‌ షా కూడా రాష్ట్రమంతటా సుడిగాలిగా తిరుగుతున్నారు. ఈ ఇద్దరి తర్వాత ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గుజరాత్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాగా, 2017 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ జరిగింది. బీజేపీ సంఖ్యాబలం 100లోపు పడిపోయింది.


దీంతో గత ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఈసారి పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణకు దిగింది. అయితే ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం చేయడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ మూలంగా వ్యతిరేక ఓట్లు చీలి తమకే ప్రయోజనం చేకూరుతోందని బిజెపి నేతలు విశ్వాసంతో ఉన్నారు.

 

మోదీయే ప్రధాన ప్రచారకుడు! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *