Top Ad unit 728 × 90

District News :

కొత్త వాహన రిజిస్ట్రేషన్లకు భారత్ సిరీస్, నెంబర్ ఎలా ఉంటుందంటే...!

కొత్త వాహన రిజిస్ట్రేషన్లకు భారత్ సిరీస్, నెంబర్ ఎలా ఉంటుందంటే...!

 

కొంత మంది తరచూ వేర్వేరు రాష్ట్రాలకు వాహనాలతో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లాక, వాహనాల రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిన పని లేదు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం తెచ్చింది. దీన్ని భారత్ సిరీస్ (BH - Series) అంటున్నారు. దీని కింద రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్ని ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా నడపవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చు. రాష్ట్రం మారినప్పుడల్లా మళ్లీ రిజస్ట్రేషన్ అక్కర్లేదు.

 

ఈ కొత్త రిజిస్ట్రేషన్ విధానం, ప్రభుత్వరంగంలోని ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు కూడా వర్తిస్తోంది. కాబట్టి వారంతా కొత్త వాహనాలకు ఇది అందుబాటులోకి వచ్చినట్లే. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. 1988 నాటి మోటర్ వెహికిల్ చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం, వాహనమైనా రిజిస్ట్రేషన్ అయిన రాష్ట్రంలో హాయిగా తిరగవచ్చు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే, 12 నెలలకు మించి తిరగకూడదు. అలా తిరగాలంటే 12 నెలల లోపు అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

 

ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునేవారు, ఆ వాహనం అసలు రిజిస్ట్రేషన్ ఏ రాష్ట్రంలో జరిగిందో, అక్కడి ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాలి. దాన్ని తీసుకెళ్లి, కొత్త రాష్ట్రంలో ఇచ్చి, అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు కొత్త రాష్ట్రం, కొత్త రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇందుకోసం ప్రోరేటా ప్రకారం రోడ్ టాక్స్ వసూలు చేస్తుంది. దాన్ని ప్రస్తుత రాష్ట్రంలో రిఫండ్ కింద పొందవచ్చు. ఇందుకోసం ప్రస్తుత రాష్ట్రంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రస్తుత రాష్ట్రం ప్రోరేటా కింద రోడ్ ట్యాక్స్ రిఫండ్ ఇస్తుంది. ఇలా ప్రస్తుత రాష్ట్రం నుంచి రిఫండ్ పొందడం అనేది చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ. పైగా ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా లేదు. అందుకే చాలా మంది దీనికి అప్లై చేసుకోవట్లేదు.

 

కొత్త భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్లను రక్షణ రంగంలోని వారు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థల ఉద్యోగులు పొందవచ్చు. ఈ సంస్థల ఆఫీసులు 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉంటే, వాటికి ఈ స్కీమ్ బాగా పనిచేస్తుంది. ఈ కొత్త రిజిస్ట్రేషన్ కలిగివున్న వాహనదారు, ఏ రాష్ట్రంలోకి వెళ్లినా మళ్లీ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పనిలేదు.

 

ఈ కొత్త BH సిరీస్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునే వాహన ఓనర్, తప్పనిసరిగా రోడ్ ట్యాక్స్ 2 సంవత్సరాలది కట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. కేంద్ర రవాణా శాఖ ప్రకారం... రూ.10 లక్షల లోపు విలువ ఉన్న వాహనానికి రోడ్ ట్యాక్స్ 8 శాతం ఉంది. అలాగే, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల విలువ ఉన్న వాహనానికి రోడ్ ట్యాక్స్ 10 శాతం ఉంది. అలాగే, రూ.20లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనానికి రోడ్ ట్యాక్స్ 12 శాతం ఉంది. రిజిస్ట్రేషన్ చేయించుకునే వాహనాలు డీజిల్ వాహనాలు అయితే, వాటికి 2 శాతం ఎక్స్‌ట్రా ఛార్జి వసూలు చేస్తారు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు అయితే వాటికి 2 శాతం తక్కువ రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు.

 

2021 కేంద్ర మోటర్ వెహికిల్స్ (20వ సవరణ) రూల్స్, 2021 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. BH సిరీస్‌లో నంబర్లను, ర్యాండమ్ విధానంలో పోర్టల్ ఇస్తుంది. BH సిరీస్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ YY BH #### XX అని వస్తుంది. ఇక్కడ YY అంటే, మొదట రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం. BH అంటే, భారత్ సిరీస్ కోడ్. #### అంటే, ర్యాండమ్‌గా వచ్చే 4 అంకెల సంఖ్య. XX అనేది 2 ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ అక్షరాలు.

 

 

కొత్త వాహన రిజిస్ట్రేషన్లకు భారత్ సిరీస్, నెంబర్ ఎలా ఉంటుందంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *