దేశంలో పూర్తయిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం
దేశంలో పూర్తయిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసిన చివరి రాష్ట్రంగా అస్సాం అవతరించింది. దీనితో ఈ పథకం దేశవ్యాప్తంగా పూర్తిస్తాయిలో అమలుకు రంగం సిద్దమయింది.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద, లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందవచ్చు. ఆగస్ట్ 2019లో ప్రారంభించబడిన ఈ పధకం దాదాపు 240 మిలియన్ రేషన్ కార్డ్‌ల పోర్టబిలిటీని నిర్ధారిస్తుంది.
ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ పై బయోమెట్రిక్ ప్రామాణీకరణ తర్వాత వారి స్వంత రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జారీ చేయబడిన రేషన్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం నుండి వలస వచ్చిన రేషన్-కార్డ్-హోల్డర్లు తమ ఆహార ధాన్యాలను పొందవచ్చు.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ తో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 436 మిలియన్లు మరియు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ అన్నా కింద 278 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. రేషన్ కార్డుల పోర్టబిలిటీ ద్వారా లబ్ధిదారులకు రూ. 40,000 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి.
