Top Ad unit 728 × 90

మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై రెండు వారాల్లో నివేదిక

మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై రెండు వారాల్లో నివేదిక

 

- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

 

తమిళనాడు మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికల వ్యవహారంపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది.

 

మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికలను హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని కోరుతూ మదురైకి చెందిన డాక్టర్‌ సయ్యద్‌ తాహీద్‌ హుసేన్‌ పిటిషన్‌ వేశారు. మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులైన 1.5 లక్షల మందిలో 19,500 మంది ప్రభుత్వ వైద్యులని, అదే విధంగా నిర్వాహకుల పదవికి పోటీ చేసే వారిలో ఎక్కువమంది ప్రభుత్వ వైద్యులే వున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయ, వ్యక్తిగత పలుకుబడి కలిగిన కొంతమంది ప్రభుత్వ వైద్యులు మాత్రమే కౌన్సిల్‌లో పదవులు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌. సురే్‌షకుమార్‌ విచారించి, రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు మెడికల్‌ కౌన్సిల్‌లు రెండు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

 

మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై రెండు వారాల్లో నివేదిక Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *