రూ.100 తిరిగివ్వనందుకు ఎస్బీఐ కి రూ.65 వేల జరిమానా
రూ.100 తిరిగివ్వనందుకు ఎస్బీఐ కి రూ.65 వేల జరిమానా
బ్యాంకులో పనిచేసే క్యాషియర్ నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). డిపాజిట్ చేసిన సొమ్ముకు అదనంగా మరో రూ.100 అదనంగా జమ చేసినందుకు కోర్టు జరిమానా విధించింది.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకానికి చెందిన లాయర్ నిర్మల్ కుమార్ 2021లో చెన్నై నుంగంబాక్కంలోని ఎస్బై బ్యాంకుకు వెళ్లాడు. తన స్నేహితుడి అకౌంట్లో రూ.900 జమ చేసేందుకు... అందుకు తగ్గట్లుగా స్లిప్పు రాసి... క్యాషియర్ రెండు రూ.500 నోట్లు ఇచ్చాడు.
ఆ నోట్లు తీసుకున్న క్యాషియర్ మొత్తం రూ.1000ను నిర్మల్ కుమార్ అకౌంట్లో వేశాడు. అయితే తాను స్లిప్పు మీద రూ.900 అని క్లియర్ గా రాశానని, అదనంగా మరో వంద రూపాయలను అకౌంట్లో ఎలా వేశావని నిర్మల్ కుమార్.. క్యాషియర్‌ను ప్రశ్నించాడు. తన రూ.100 తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు క్యాషియర్. ఆ వంద రూపాయల్ని మీ ఫ్రెండ్ దగ్గరే తీసుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆ లాయర్... తన టాలెంట్‌తో క్యాషియర్ కు సరైన సమాధానం ఇవ్వాలనుకొని... చెన్నై సర్కిల్ బ్యాంకు ఆఫీస్, ముంబయి ఆఫీస్‌లలో ఫిర్యాదు చేశాడు.
అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. అనంతరం చెంగల్పట్టు వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. ఈ కేసుపై సుమారు ఒకటిన్నర సంవత్సరంపాటు విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం తీర్పు వెలువడింది. వినియోగదారుడికి బ్యాంకు క్యాషియర్ రూ.100 తిరిగివ్వని కారణంగా సేవా లోపంగా పరిగణిస్తూ సదరు బ్యాంకు పిటిషన్‌దారుడికి రూ.50 వేలు, కేసు నిర్వహణకు గాను ఖర్చు పెట్టిన రూ.15 వేలతో కలిపి రూ.65 వేలు జరిమానా చెల్లించాలని తీర్పు వచ్చింది.
