Top Ad unit 728 × 90

గుప్త నిధులకోసం కన్న పిల్లలనే బలి ఇవ్వాలనుకున్న కిరాతకులు...!

కాళీమాతకు చిన్నారులను బలిస్తే గుప్తనిధులు దొరుకుతాయనే మంత్రగాడి మాటలు విని ఐదుగురు చిన్నారులను బలివ్వడానికి యత్నించిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  రాష్ట్రంలోని శివసాగర్ జిల్లాకు చెందిన జమియుల్ హుసేన్, షరిఫుల్ హుసేన్లు అన్నదమ్ములు. వీళ్లిద్దరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో జమియుల్ ఇంటి వెనకాల ఉన్న మామిడిచెట్టుకు ఐదుగురు మైనర్లను కట్టేసి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

 

అంతకు ముందు అన్నదమ్ములు స్థానికంగా ఉండే మంత్రగాడిని కలిశారు. తమ పిల్లలను కాళీమాతకు బలిస్తే గుప్తనిధులు దొరకడంతో పాటు కుటుంబంలోని సమస్యలు తీరుతాయని మాంత్రికుడు వాళ్లకు వివరించాడు. దీన్ని నమ్మిన ఇద్దరు వ్యక్తులు తమకు ఉన్న సంతానాన్ని ఇలా చెట్టుకు కట్టేసి బలివ్వడానికి సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా అన్నదమ్ముల ప్రవర్తనపై అనుమానంగా ఉన్న చుట్టుపక్కల నివాసాల్లో ఉండే వాళ్లు వీళ్లపై నిఘా ఉంచారు. అర్ధరాత్రి సమయంలో పిల్లల ఏడుపు వినిపించడంతో స్థానికులు చిన్నారుల బలిని అడ్డుకొని వాళ్ల తల్లిదండ్రులు అక్కడి నుంచి పారిపోకుండా పట్టుకున్నారు.

 

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లకు సహకరించిన మరో మహిళనూ అరెస్టు చేశారు. విచారణలో తాము పిల్లలను గుప్తనిధుల కోసం బలివ్వాలనుకున్నామని, క్రమంలో వాళ్లను కొన్ని రోజులుగా ఒక గదిలో ఉంచినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వివరించారు.

 

Tags: pslvtv,crime news,assam,kids,latest news,breaking news,national news,telugu

గుప్త నిధులకోసం కన్న పిల్లలనే బలి ఇవ్వాలనుకున్న కిరాతకులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *