Top Ad unit 728 × 90

ఆ విషయంలో రాహుల్ గాంధీ మనసును మార్చింది ఎవరు…?

ఆ విషయంలో రాహుల్ గాంధీ మనసును మార్చింది ఎవరు…?

 

రాహుల్, ప్రియాంకతో భేటీ అవుదామని పంజాబ్ ఫైర్‌బ్రాండ్ సిద్దూ ఢిల్లీ బయల్దేరారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అపాయింట్‌మెంట్ దొరికింది కానీ, రాహుల్ మాత్రం నిరాకరించారు. దీంతో సిద్దూకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చిందని అందరూ భావించారు. కానీ రాత్రి 8 గంటల ప్రాంతంలో రాహుల్ నుంచి సిద్దూకు పిలుపు అందింది. సిద్దూకు రాహుల్ అపాయింట్‌మెంట్ దొరికింది. దాదాపు 30 నిమిషాల పాటు ఇద్దరు నేతలూ చర్చించుకున్నారు. అయితే సిద్దూకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఫిక్స్ కావడం వెనుక ఎవరి పాత్ర వుంది…? రాహుల్ మనసును మార్చింది ఎవరు…? దీనంతటి వెనుకా కీలక పాత్ర పోషించింది ప్రియాంక గాంధీయే. అవును, పార్టీలో ఒక్కసారిగా ప్రియాంక క్రైసిస్ మేనేజర్‌గా మారిపోయారు. నిజానికి రాహుల్ షెడ్యూల్‌లో సిద్దూను కలవడం లేదు. కానీ, అప్పటికప్పుడు షెడ్యూల్‌లో సిద్దూ పేరు చేర్చింది ప్రియాంక గాంధీయే అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్‌ను ప్రియాంక ఒప్పించడంతోనే సిద్దూను కలవడానికి రాహుల్ రెడీ అయినట్లు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు అసంతృప్త నేత సిద్దూకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం శుక్రవారం అధికారికంగా ప్రకటన చేయనుంది.

ఆ విషయంలో రాహుల్ గాంధీ మనసును మార్చింది ఎవరు…? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *