Top Ad unit 728 × 90

సీసీఎంబీ నూతన డైరెక్టర్‌గా డా.వినయ్‌ నందికూరి

సీసీఎంబీ నూతన డైరెక్టర్‌గా డా.వినయ్‌ నందికూరి

 

హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) నూతన డైరెక్టర్‌గా ప్రముఖ ఇమ్యునాలజిస్ట్‌ డా.వినయ్‌కుమార్‌ నందికూరి నియమితులయ్యారు. ఇదివరకు డైరెక్టర్‌గా ఉన్న డా.రాకేశ్‌మిశ్రా నెల రోజుల క్రితం పదవీ విరమణ చేయడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో డా.వినయ్‌ను నియమించింది. ఈ మేరకు ఆయన మంగళవారం సీసీఎంబీ పరిశోధనశాలలో బాధ్యతలు స్వీకరించనున్నారు. డా.వినయ్‌ ప్రస్తుతం దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ(ఎన్‌ఐఐ)లో స్టాఫ్‌ సైంటిస్టుగా, గుహా రీసెర్చ్‌ కాన్ఫరెన్స్‌, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌లో ఆచార్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పాతికేళ్లకుపైగా ఇమ్యునాలజిస్టుగా, బయోటెక్నాలజిస్టుగా వివిధ హోదాల్లో సేవలందించారు. క్షయ వ్యాధిపై పరిశోధనలు చేసి వ్యాధికారక ప్రొటీన్లను గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు. ఐఐటీ బాంబే నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆయన.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

సీసీఎంబీ నూతన డైరెక్టర్‌గా డా.వినయ్‌ నందికూరి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *