Top Ad unit 728 × 90

గాల్లో ఊగిపోయిన విస్తారా ఎయిర్‌లైన్ విమానం...!

గాల్లో ఊగిపోయిన విస్తారా ఎయిర్‌లైన్ విమానం...!

 

విమానం ల్యాండ్ కావడానికి ముందు గాల్లో ఊగిపోవడంతో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. కోల్‌కతాలో జరిగిందీ ఘటన. గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ముంబై నుంచి కోల్‌కతా బయలుదేరిన విస్తారా ఎయిర్‌లైన్ కు చెందిన యూకే775 విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి 15 నిమిషాల ముందు గాల్లో ఒక్కసారిగా ఊగిపోయింది.

 

ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు భయంతో వణికిపోయారు. విమానం ఊగిపోవడంతో ప్రయాణికులు కొందరు గాయపడ్డారు. వీరికి విమాన సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. అయితే, కోల్‌కతా విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు విస్తారా అధికార ప్రతినిధి తెలిపారు.

 

గాల్లో ఊగిపోయిన విస్తారా ఎయిర్‌లైన్ విమానం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *