Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఇకనుండి తెలంగాణలో అంతా ఆన్ లైన్ పరిపాలనే…!

ఇకనుండి తెలంగాణలో అంతా ఆన్ లైన్ పరిపాలనే…!

 

కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు అనుకుంటున్నా, అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు కరోనా కారణంగా పూర్తిస్థాయి ఈ-పాలన రాబోతోంది. సోమవారం ఈ-పాలనను ప్రారంభిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా, దాన్ని సీఎం కేసీఆర్ డిజిటల్ ఫార్మాట్‌లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చూస్తారు. అలాగే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పేపర్‌తో పనిలేకుండా అంతా ఆన్‌లైన్ రూపంలో జరుగుతాయి. సంప్రదాయ సంతకాల స్థానంలో డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి. చర్చలు, సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే. ఇకఫైలైనా ఆన్‌లైన్ పరమే. ఏ నిర్ణయమైనా డిజిటల్‌లోనే. అన్నింటికీ పక్కా ఆధారాలుంటాయి. పూర్తి పారదర్శకమైన పాలన రాబోతోంది. ప్రజలు పెట్టుకునే అర్జీలు, ప్రతిపాదనలన్నీ స్కాన్ అవుతాయి. సంబంధిత కలెక్టర్లేట్లకు ఆన్‌లైన్‌లో వెళ్తాయి. తద్వారా కలెక్టరేట్లు, మండల, డివిజన్, ఇతర ఆఫీసుల్లో ఈ-పాలన అమలవుతుంది. తహశీల్దార్, MPDO, RDO, DPO ఇలా విభాగాలన్నీ ఆన్‌లైన్‌లోనే ఫైళ్లను చెక్ చేసి ఆమోదిస్తాయి.

 

అంటే ప్రజలు ఇచ్చే అర్జీలు పేపర్ల రూపంలో ఉన్నా ప్రభుత్వం మాత్రం వాటిని ఆన్‌లైన్ స్కానింగ్ ప్రతుల రూపంలోనే చూడనుంది. దీని వల్ల చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఏ ఫైల్ ఏ దశలో ఉందో క్షణాల్లో తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లో ఉండి కూడా ఫైళ్లను ఆన్‌లైన్‌లో తెరచి చూసి ఓకే చెయ్యొచ్చు. అలాగే, ఏదైనా ఫైల్ కోసం గంటల తరబడి వెతకాల్సిన అవసరం ఉండదు. క్షణాల్లో అది సెర్చ్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. ఏ ఫైల్ ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో తెలుసుకొని సంబంధిత అధికారిని వెంటనే పని పూర్తి చెయ్యమని సీఎం ఆఫీస్ వర్గాలు కోరే అవకాశాలున్నాయి. అందువల్ల పని వేగం పెరుగుతుంది. అలాగే, పనిలో కచ్చితత్వమూ ఉంటుంది. కాలయాపన తగ్గుతుంది.

పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, ఆఫీసుల్లో డిజిటల్ కాన్ఫరెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అలాగే, ఫైళ్లను బార్ కోడింగ్ చేస్తారని తెలిసింది. ఇకపై ప్రతి సోమవారం ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో DDRC సమావేశాలు నిర్వహించనుంది. నీటి ప్రాజెక్టుల పనుల్లో అభివృద్ధి, ప్రభుత్వ సహాయ చర్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అన్ని అంశాల్నీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. ఏ జిల్లాలో ఏ లోటుపాట్లున్నా వెంటనే వాటిని సరిచేస్తారు. అంతా ఆన్‌లైన్ అయినప్పటికీ కేబినెట్ సమావేశాలు, తీసుకునే నిర్ణయాలపై మాత్రం సీక్రెసీ మెయింటేన్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, శాఖల వారీగా ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇవ్వనున్నారు. తద్వారా సమాచార భద్రతకు ఎలాంటి లోటూ లేకుండా చేయనున్నారు.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇకనుండి తెలంగాణలో అంతా ఆన్ లైన్ పరిపాలనే…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *