MLC కోదండరాం సార్ తో పార్ట్ టైం లెక్చరర్ల విన్నపం
MLC కోదండరాం సార్ తో పార్ట్ టైం లెక్చరర్ల విన్నపం
వ్యాసకర్త:- డా. ఎం. ఎన్. ఆచార్య-తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిషశాఖ పార్ట్ టైం అధ్యాపకులు.
దేశప్రగతి తరగతిగదిలోనే ఉంది... ఒక అధ్యాపకుడు తన బోధనతో ఎందరో విద్యార్థులను చైతన్య పరచి సమాజానికి అందిస్తాడు, అలాంటి ఆ విద్యా వ్యవస్థ నేడు అంపశయ్యపై ఉన్నది. చదువును నమ్మనుకుని బోధనను నమ్ముకుని విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే అధ్యాపకుల జీవితాలే ఆటకెక్కుతుంటే ఈ సమాజం ముక్కుమీద వెలువేసుకుని నివ్వరపోయి చూస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వ విద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు UGC నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా విద్యార్హతలు కలిగి ఉండి, దాదాపు 15 సంవత్సరాలకు పైగా పనిచేస్తూ సరైన జీతాలు లేక ఆరునెలల జీతాలు అర్థాకలి బతుకులతో వెల్లదీస్తున్న వారి జీవితాలు వర్ణాతీతం.
సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని, పార్ట్ టైం అధ్యాపకులందరూ తమ ఒక రోజులో పూర్తీ సమయం బోధనకే కేటాయించడం వలన ఆర్ధికపరమైన ఇతర సంపాదన ఏమిలేక లేక అరకొర జీతాలతో జీవితాలను తమకున్న కుటుంబ పోషణ భాద్యలతో సతమతమౌతూ మానసిక వేదనకు గురి అవుతున్నారు. మా తెలంగాణ మాకొస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రాణాలను సైతం లెక్క చేయక ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ సాధన పోరాటానిక మొదటి సమిదలైనారు. రిలే నిరాహారదీక్షలు, లాటి దెబ్బలు, బాష్పవాయువు పీడలను సైతం భరించి అటూ అధ్యాపనను కొనసాగిస్తూనే ఉద్యమాన్ని ఉవ్వేత్తు ఎగిసిపడే పోరాటం చేసారు.
ఎన్నో సంవత్సారాల నుండి అధ్యాపక వృత్తిని నమ్ముకుని తమకు మంచి రోజులు వస్తాయని గుండె నిండా సముద్రమంతా భాదను మోస్తూ పైకి మేడిపండులగా వ్యవహరిండం నేటికి తప్పడంలేదు. దాదాపు అందరి వయస్సు 40 నుండి 50 సంవత్సరాలు దాటినా వారే కాబట్టి అన్ని విధాల అలసిన హృదయాలతో నీరుకారిపోతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు పోటి పరీక్షలనే విధానాన్ని పక్కన బెట్టి సహృదయతతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు ఉద్యోగ భద్రతను కలిపిస్తూ మమ్మల్ని అసిస్టెంట్ ప్రోఫెసర్లుగా అప్గ్రేడ్ చేస్తూ G.O పాస్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని వినప్రంగా విన్నవించుకుంటున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ అమలు పరుచడంలో ఆలస్యం చేయకూడదని కోరుతూ.. విశ్వవిద్యాలయాలలో అధ్యాపక పోస్టులు దాదాపు 70 శాతం ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేసినా ఇంకా చాలా పోస్టులు ఖాళీగానే ఉంటాయి కాబట్టి ప్రస్తుతం పనిచేస్తున్న అందరిని ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే మమ్మల్ని పర్మనెంట్ చేయాలని అభ్యర్ధన చేస్తూ… యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ పోస్టులను భర్తీ చేయక పోవడం వలన పరిశోధనలు ఆగిపోతున్నాయి, విద్యా వ్యవస్థ కుంటుపడి, సమాజలో ఉన్న నిరుద్యోగుల జీవితాలు అధోగతి చెందకుండా చూసే భాద్యత తెలంగాణలో ఉన్న విద్యావేత్తలు, సామజిక వేత్తలు, రాజకీయ విశ్లేషకులు, కవులు, అన్ని రంగాలకు సంబంధించిన మేధావులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు ఈ వియాయంపై తీక్షణంగా ఆలోచించాలని, మీ సహకారం వలన విద్యా వ్యవస్థ మసక బారకుండా మాకు తగిన న్యాయం చేయాలని, మేము ఎదుర్కొంటూ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ… MLC గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ కోదండరాం సార్ గారిని కోరుతూ విద్యా వ్యవస్థలోని సమస్యలను, అలాగే పార్ట్ టైంగా పని చేస్తున్న మా జీవితాలలో వెలుగులో నింపాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైమ్ లెక్చరర్స్ అసోషియేషన్ అధ్యక్షులు డా. భువనకుర్తి సోమేశ్వర్ గారు, తెలుగు విశ్వవిద్యాలయం పార్ట్ టైం లెక్చరర్ల అధ్యక్షులు డా. ఎం. నరసింహాచారి గారు, కోఠి మహిళ విశ్వ విద్యాలయం నుండి డా. వరలక్ష్మి గారు, నిజాం కళాశాల నుండి డా. ఆరుట్ల జానకీరెడ్డి గారు మొదలుకుని అన్ని విశ్వ విద్యాలయాలకు సంబంధించిన పార్ట్ టైం అధ్యాపకుల వివిధ విశ్వవిద్యాలయ అధ్యక్షులు తమ సమస్యలను విన్నవిస్తూ ప్రసంగించారు.