Top Ad unit 728 × 90

మెదక్ కాంగ్రెస్‌లో ED భయం మరో కీలక నేతకూ నోటీసులు...!

మెదక్ కాంగ్రెస్‌లో ED భయం మరో కీలక నేతకూ నోటీసులు...!

 

ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఎన్ఫోర్స్ మెంట్(ఈడీ) భయం పట్టుకున్నది. నేషనల్ హెరాల్డ్‌కు విరాలాళిచ్చారనే నేపథ్యంలో ఈడీ నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి, జహీరాబాద్ సెగ్మెంట్ నుంచి ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ గీతారెడ్డికి మొదట నోటీసులు రాగా.. తాగాజా రెండు రోజుల క్రితం పటాన్ చెరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్ కుమార్‌కూ నోటీసులు అందాయి. అక్టోబర్ 12న డిల్లీలోని ఈడీ ఆఫీసులో హాజరుకావాలని గాలికి ఈడీ ఆదేశించింది. కాగా, ఢిల్లీలోనే మకాం వేసిన గాలి అనిల్ కుమార్ నోటీసులపై ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని, కావాలని ఇలా నోటీసులు పంపి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నదని ఆరోపిస్తున్నారు.


ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతలకు ఈడీ నోటీసులు పంపడం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ లీడర్‌గా, మాజీ మంత్రిగా డాక్టర్ గీతారెడ్డికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాలాళిచ్చారని ఈడీ ఇటీవల గీతారెడ్డికి నోటీసులు ఇచ్చింది. గీతారెడ్డితో పాటు రాష్ట్రంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లు ఈడీ నోటీసులు అందుకున్నారు. వారితో పాటు గాలి అనిల్ కుమార్ కూడా ఈ నెల 28న ఈడీ నుంచి నోటీసులు తీసుకున్నారు. గతంలో అనిల్ కుమార్ నేషనల్ హెరాల్డ్‌కు కొంత మొత్తం డబ్బులు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. రికార్డులో పరిశీలనలో భాగంగా గాలి పేరు బయటపడడంతో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, ఎంత మొత్తంలో ఇచ్చారు..? ఎప్పుడు ఇచ్చారనేది తెలియాల్సి ఉన్నది. అయితే, ఒకే జిల్లా నుంచి ఇద్దరు నేతలు ఈడీ నోటీసులు అందుకోవడం జిల్లా పార్టీలో కలకలం రేపుతోంది.

 

బీజేపీ కక్ష్యపూరితంగా ఈడీ పేరుతో కాంగ్రెస్ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తున్నదని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసినప్పటికీ ఎప్పటి నుంచో నేషనల్ హెరాల్డ్ ఉన్నదంటున్నారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం ఎవరినీ పార్టీలో పనిచేయకుండా చూడాలని బీజేపీ భావిస్తుందని ఆ పార్టీ నేతలు మండి పడుతున్నారు. కాగా నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. గాలి అనిల్ కుమార్ కూడా ఢిల్లీల్లోనే ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు. పార్టీ అధిష్టాన పెద్దలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. తాము ఎలాంటి అక్రమాలు చేయలేదనే ధీమాతో ఉంటూనే ఈడీ కావాలుకుని టార్గెట్‌గా ఇబ్బలుందులకు గురిచేసే అవకాశం ఉన్నదని ఒకింత భయాందోళనకు గురవుతున్నట్లు ఈడీ నోటీసులు అందుకున్న వారి సన్నిహితులు చెబుతున్నారు. విచారణల పేరుతో తీవ్ర ఇబ్బందులు పెట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే పనిలో బీజేపీ ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు.

 

మెదక్ కాంగ్రెస్‌లో ED భయం మరో కీలక నేతకూ నోటీసులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *