Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 29 అక్టోబర్ 2020

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 29 అక్టోబర్ 2020

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు సృజనాత్మక కార్యాలపై మీపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో నూతన హక్కులు కలిసివస్తాయి. కుమారుడు లేదా కుమార్తే వివాహం ముగింపు బలంగా ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరకి అనుకున్నది పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. పెద్దలతో వివాదలకు దూరంగా ఉండండి. వారి అభిప్రాయాన్ని కూడా వినండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యాపార భాగస్వామ్యుల నుంచి ప్రయోజనం అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం ఉంటుంది. రుణభారం తగ్గుతుంది. గౌరవం పొందుతారు. ప్రాపంచీక ప్రతిష్ఠ మిమ్మల్ని ముంచెత్తుతుంది.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు రాజకీయ రంగాల్లో ఉన్నవారు విజయాన్ని అందుకుంటారు. అంతేకాకుండా సమాజంలో గౌరవంతో పాటు కీర్తి పెరుగుతుంది. మీకిష్టమైనవారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. సంపద లభిస్తుంది. నూతన బంధాల్లో స్థిరత్వం ఉంటుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు తీవ్రమైన సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ సన్నిహితులు, స్నేహితులు మీ భావాలను గుర్తిస్తారు. వారి చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఆత్మ సంతృప్తి చెందుతారు. కొన్ని సార్లు ఇతరుల మాట వినడంలో సమస్య ఉండదని గుర్తుంచుకోండి. దుకాణం లేదా కార్యాలయంలో మీ జట్టు కృషి ఎక్కువగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు స్నేహితుల నుంచి వ్యయం ఉంటుంది. కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆఫీసులో అకస్మాత్తుగా వచ్చిన మార్పు కూడా ఆశ్చర్యం కలిగించవచ్చు. మహిళా సహచురులపై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు  నూతన పనిలో చట్టబద్ధమైన, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. తద్వారా లాభం ఎక్కడ ఉందో, నష్టం ఎక్కడ ఉందో మీరు అంచనా వేయగలుగుతారు. ఎవరో చెప్పిన మాటలను విని నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు నూతన వ్యక్తులతో పరిచయమవుతారు. మీరు ఎంచుకున్న రంగంలో ప్రయోజనాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఒకరిని సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్నవారి అభిప్రాయాన్ని తీసుకోవడం మంచిది. మీరు కళ్లు మూసుకుని వారిని నమ్మవచ్చు. ఇంటితో పాటు పనిప్రదేశంలో సక్రమంగా బాధ్యతలను విజయవంతంగా నిర్విర్తిస్తారు. ప్రతి చోటా ప్రశంసలు అందుకుంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. పాత బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. మరోవైపు మీ సూచనలు ఈ రంగంలో స్వాగతించబడతాయి. కొన్ని అనవసరమైన గృహోపకరణాలు కూడా కొనవాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మీరు ఎవరి నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు  కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులు లేదా బంధువులు అకస్మాత్తుగా మీ ఇంటికి వస్తారు. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి ప్రత్యేకంగా గమనించండి. ఎవరినైనా రుణం అడిగితే ఆలోచించి ఇవ్వండి. లేకపోతే డబ్బు ఇరుక్కుపోయే అవకాశముంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు రాజకీయ రంగంలో విజయవంతమవుతారు. నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త అవసరం. అవసరమైన వ్యయం చేస్తారు. సద్గుణ కార్యాక్రమాల కోసం ఖర్చు చేస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. పెట్టుబడుల్లో లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు సంపద పెరుగుతుంది. మీ అమ్మమ్మ నుంచి గౌరవం పొందుతారు. మీకు కొన్ని బాధ్యతలు కేటాయించవచ్చు. నూతన పని ప్రారంభిస్తారు. ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. సాయంత్రం నాటికి మీకు మరికొన్ని ఆహ్లాదకరమైన వార్తలు వస్తాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. రహస్య శత్రువులు ఉద్యోగంలో నియామితులవుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

 

జై శ్రీమన్నారాయణ.

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 29 అక్టోబర్ 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *