Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు గురువారం 25 జూన్ 2020

ఈ రోజు మీ రాశి ఫలాలు గురువారం 25 జూన్ 2020

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

మేషం: ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు మార్పులు. దేవాలయ దర్శనాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభం: ఈ రోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

మిధునం: ఈ రోజు కార్యక్రమాలలో అవరోధాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. సోదరులు, సన్నిహితులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకం: ఈ రోజు సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహం: ఈ రోజు కృషి ఫలించదు. కార్యక్రమాలలో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్య: ఈ రోజు నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

తుల: ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

వృశ్చికం: ఈ రోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనస్సు: ఈ రోజు బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరం: ఈ రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. విచిత్రమైన సంఘటనలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రగతి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

కుంభం: ఈ రోజు కొత్త పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేకత. చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనం: ఈ రోజు కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వివాదాలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

 

జై శ్రీమన్నారాయణ.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు గురువారం 25 జూన్ 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *