Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు మంగళవారం 30 జూన్ 2020

ఈ రోజు మీ రాశి ఫలాలు మంగళవారం 30 జూన్ 2020

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

మేషం: ఈ రోజు ఓ శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసే వాళ్లు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో వేదిస్తున్న దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభం: ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో స్వల్పలాభాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ధన లాభం అందుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి కొంతవరకు బయటపడతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

మిధునం: ఈ రోజు చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. పక్కవారిని కలుపుకు పోతే పనులు త్వరగా పూర్తవుతాయి. సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తులాభం ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకం: ఈ రోజు సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ లభిస్తుంది. కీలక వ్యవహారాలకు మీరు ఆశించిన స్థాయిలో సహాయం అందుతుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికలావాదేవీలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహం: ఈ రోజు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు వింటారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్య: ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నూతన ప్రయత్నాల్లో తొందరపాటు పనికిరాదు. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

తుల: ఈ రోజు వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

వృశ్చికం: ఈ రోజు బంధువులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానం నుంచి ధన, వస్తు లాభాలు ఉంటాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

ధనస్సు: ఈ రోజు సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ కూడా పొందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నూతన ప్రయత్నాల్లో తొందరపాటు పనికిరాదు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా వారితో సమయాన్ని గడుపుతారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరం: ఈ రోజు ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.  సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

కుంభం: ఈ రోజు క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. శుభవార్తలు అందుకుంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనం: ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. పాత మిత్రుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

 

జై శ్రీమన్నారాయణ.

ఈ రోజు మీ రాశి ఫలాలు మంగళవారం 30 జూన్ 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *