Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 28 సెప్టెంబర్ 2020

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 28 సెప్టెంబర్ 2020

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

మేషరాశి (Aries) వారికి: ఈ రోజు దాంపత్య సంబంధం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అశాంతి నెలకొంటుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత కొరవడుతుంది. వాహన సమస్యలు తలెత్తుతాయి. అకస్మాత్తుగా గృహ సమస్యలు వచ్చే అవకాశముంది. కొన్ని శుభవార్తలు రాకతో ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాకుండా స్నేహితుల నుంచి స్నేహితుల మద్దతు లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) వారికి : ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టి పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. స్థిరాస్తుల వివాదాలను పరిష్కరించడం అవసరం. ఆర్థికంగా ఈ రోజు మీరు బలంగా ఉంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

మిధునరాశి (Gemini) వారికి: ఈ రోజు ఆహారంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. అజీర్తి సమస్య ఉండే అవకాశముంది. అనవసర ఖర్చులు చేయకుండా ఉంటే మంచిది. ఎంతో సానుకూలంగా ఉంటుంది. మీ ప్రవర్తన ద్వారా అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ జీవితంలో ఎదురైన సమస్యలు అంతమవుతాయి. మీ కంటే చిన్నవారు లేదా పిల్లల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) వారికి: ఈ రోజు అధిక ఉత్సాహం, సంసిద్ధత మీ పనిని పాడుచేస్తుంది. శుభవార్తలు అందుకుంటారు. పాత స్నేహితులను, సన్నిహితులను కలుసుకుంటారు. ఆర్థిక, కుటుంబంలో అవరోధాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. మార్పు కోసం బలమైన కోరిక ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) వారికి: ఈ రోజు మీరు చేసే పనిలో, వ్యవహారంలో వ్యతిరేకత ఉంటుంది. కుటుంబ సమస్యలకు సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకోంటారు. అజాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. ఒకరితో విభేదాల వల్ల ప్రవర్తన మారవలసి ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) వారికి: ఈ రోజు మానసిక సమస్యల వల్ల ఆందోళన చెందుతారు. అసంపూర్తి పనులును ఎలాగైనా పూర్తి చేస్తారు. మీకిష్టమైన వారిని కలుస్తారు. అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. కష్టపడి పనిచేస్తే అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. పని ప్రదేశంలో తీరిక లేకుండా గడుపుతారు. మీరు ప్రయాణాలు చేసే అవకాశముంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

తులారాశి (Libra) వారికి: ఈ రోజు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో లాభాలు అందుకుంటారు. మొత్తం మీద ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరనుకున్న పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సజావుగా జరిగేలా కనిపిస్తాయి. శుభకార్యల ద్వారా మీ సన్నిహితులను కలిసి వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. పనికోసం తగిన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

వృశ్చికరాశి (Scorpio) వారికి: ఈ రోజు శుభవార్తలు అందుకుంటారు. నిరంతరం కొనసాగుతుంది. మీరు చేయాల్సిన పనిని కూడా చేయండి. శుభకార్యాల కోసం తగిన ప్రణాళిక తయారు చేయడంలో ఇతరులను సంప్రదిస్తారు. ఆహారం ఆరోగ్యం పెంపొందుతుంది. స్నేహితులు, బంధువుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో ప్రతిక్రియ పరిస్థితి ఏర్పడుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) వారికి: ఈ రోజు మీ జీవితంలో గొప్ప వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. పొత్తి కడుపు, కళ్ల నొప్పి కారణంగా ఆరోగ్యం ప్రభావితమవుతుంది. మీ పని ప్రదేశంలో కొన్ని విభేదాలు ఉంటాయి. కేసులు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమయానుగుణంగా నడుచుకోవడం ఎంతో ముఖ్యం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) వారికి: ఈ రోజు మానసిక సమస్యలు లేదా సంతానం నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఫలితంగా ఆందోళన పెరిగి తలనొప్పి వస్తుంది. పొరుగువారి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహంలో మీకు ఆనందం పెరుగుతుంది. ఎప్పుడో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తిచేస్తారు. అంతేకాకకుండా లాభదాయకమైన వెంచర్లు ప్రారంభిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

కుంభరాశి (Aquarius) వారికి: ఈ రోజు ఆర్థిక అవకాశాలు కలిసి వస్తాయి. పూర్వీకుల నుంచి లాభం వస్తుందని ఆశ పడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఊహించని సందేహాలు, వాదనలతో సమయం వృధా అవుతుంది. ఆర్థికాంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. డబ్బును కోల్పోతారు. ప్రణాళికబద్ధమైన పనులు విజయవంతమవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) వారికి: ఈ రోజు అనాలోచిత జోక్యం కారణంగా లాభం పొందుతారు. దీనిపై తగిన శ్రద్ధ అవసరం. ప్రత్యర్థుల నుంచి ఓడిపోతారు. జీవితంలో మీ ఖర్చు పెరుగుతుంది. నిర్మాణ పనులు అవసరాన్ని మీరు అందుకుంటారు. ప్రతిపక్షం లేదా విపక్ష ప్రజల నుంచి మద్దతు పొందుతారు. ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రారంభిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

గమనిక: ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

 

జై శ్రీమన్నారాయణ.

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 28 సెప్టెంబర్ 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *