Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ఇండియాలో రెడ్ మీ నోట్ 9 ఓపెన్ సేల్...!

ఇండియాలో రెడ్ మీ నోట్ 9 ఓపెన్ సేల్...!

 

షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 9 మనదేశంలో ఓపెన్ సేల్లో అందుబాటులో ఉంది. అమెజాన్, ఎంఐ.కాం సైట్లలో ఫోన్ అందుబాటులో ఉంది. ఇందులో 5020 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. దీంతో పాటు లేటెస్ట్ ప్రాసెసర్ అయిన మీడియాటెక్ హీలియో జీ85ను అందించారు. రెడ్ మీ నోట్ 9 ధర ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గానూ ఉంది. ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్, పెబుల్ గ్రే రంగుల్లో ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందులో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను షియోమీ అందించింది. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై రెడ్ మీ నోట్ 9 పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ను ఇందులో అందించారు.



మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. ముందువైపు 13 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్ మీ నోట్ 9 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్ గా ఉంది. 22.5W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. 9W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కూడా ఇందులో అందించారు.

ఇండియాలో రెడ్ మీ నోట్ 9 ఓపెన్ సేల్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *