Top Ad unit 728 × 90

జీహెచ్‌ఎంసీలో కామ పిశాచి!

జీహెచ్‌ఎంసీలో కామ పిశాచి!

 

హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికురాలనిపై జీహెచ్ఎంసీ సర్కిల్ ఎసిఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ అనే దురాగతుడి కీచక పర్వం. తన కింద పనిచేసే కార్మికురాలని చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా వీడియోలు, పోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.

 

ఐతే ఆ వీడియోలు బయటకు రాగా... కామాంధుడి చేష్ఠలు చూసిన పలువురు ఛీ వీడు మనిషేనా అని మండిపడుతున్నారు.

 

వివరాల్లోకెళ్తే... కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి అదే సర్కిల్‌లో పని చేసే ఓ పారిశుద్ధ్య కార్మికుకురాలిపై కన్నేసాడు. అధికార దర్పంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే దుస్సాహసానికి వడిగట్టాడు. తాను చెప్పినట్లు వినాలని హుకూం జారీ చేశాడు.

 

ఆఖరికి అతడి మాట వినకపోతే... విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. దీంతో బాధితురాలు కీచక కిషన్ వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించింది. పైగా వాటన్నింటిని ఫోన్‌లో రికార్డ్ చేసేవాడు

 

ఏం జరిగిందో కానీ... కిషన్ వీడియోలు బయటకు రావడం సహ ఉద్యోగుల వరకు చేరిపోవడం జరిగింది. దీంతో వారంతా సదరు ఉద్యోగిని గట్టిగా ప్రశ్నించటంతో... ఎవరికి చెప్పవద్దంటూ... రూ. 10 వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... అతడిపై చర్యలు తీసుకోవాలని సహోద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కిషన్‌పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.

 

జీహెచ్‌ఎంసీలో కామ పిశాచి! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *