Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ ఢీకొని సూపర్‌వైజర్ వెంకటేష్ (33) మృతి కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం: 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం...!

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలో క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేసింది ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంది. దాని ప్రకారం ముందుగా 9,10 తరగతులు.. ఆ తర్వాత మిగిలిన తరగతులను గ్యాప్ ఇచ్చి, దశల వారీగా క్లాసులను రీ-ఓపెన్ చేయాలని షెడ్యూల్ ఖరారు చేసుకుంది. ఇక, ఇవాళ్టి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించనుంది ఏపీ విద్యాశాఖ. ఇప్పటికే విద్యా శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో స్కూళ్ల రీ-ఓపెన్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఇప్పుడూ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.

 

ఎనిమిదో తరగతి క్లాసులు నిర్వహించాలని నిర్ణయించడంతో పదో తరగతి క్లాసుల నిర్వహణ విషయంలో కొంత మేర షెడ్యూల్లో మార్పులు చేశారు. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరయ్యేలా షెడ్యూల్ మారింది. ఇక నుంచి పదో తరగతి విద్యార్థులు ప్రతి రోజూ స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి 1-5 తరగతులను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *