Top Ad unit 728 × 90

చెన్నై వైఫల్యం కాదు ఇక ధోనీ నిష్క్రమణే...!

చెన్నై వైఫల్యం కాదు ఇక ధోనీ నిష్క్రమణే...!

 

శుక్రవారం ఒక మేటి జట్టు దారుణ పరాభవాల చరిత్రకు ముగింపు పలికింది. ఇది ఒక జట్టు పరాభవం కంటే బారత జట్టుకు ప్రపంచ కప్లను సాధించిపెట్టిన మేటి కేప్టెన్ ఘన చరిత్రకు మంగళం పలికినట్లయింది. అనితర సాధ్యమైన విజయాలతో భారత క్రికెట్ని దశాబ్దంపైగా శాసించిన మహేంద్ర సింగ్ ధోనీ నిష్క్రమణకు శుక్రవారం నాటి పరాజయం నాంది పలికినట్లేనని క్రీడా నిపుణులు చెబుతున్నారు.ఐపీఎల్‌-2020 సీజన్లో మాజీ ఛాంపియన్చెన్నై సూపర్కింగ్స్‌ (సీఎస్కే) కథ ముగిసింది. శుక్రవారం రాత్రి షార్జా వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయం పాలై ప్లే ఆఫ్స్రేసు నుంచి నిష్క్రమించింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే అభిమానులు ఆశలను అడియాశలు చేస్తూ.. ఎవరూ ఊహించిన విధంగా 11 మ్యాచ్ల్లో ఎనిమిదో ఓటమితో తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీఎల్చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి చివరి స్థానానికి పరిమితం అయ్యింది. మూడు సార్లు ఛాంపియన్‌, ఐదుసార్లు రన్నరఫ్తో పాటు అన్ని సీజన్స్లో ఫ్లే ఆఫ్స్కి చేరిన ఘనత కలిగిన చెన్నై ఈసారి టోర్నీలో కనీస పోరాట పటిమను సైతం చూపలేక ఆటగాళ్లు ప్రత్యర్థికి దాసోహమన్నారు. దీంతో కేవలం మూడు విజయాలు ఆరు పాయింట్లతో చివరి స్థానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.జట్టు సారథి మహేంద్రసింగ్ధోనీ కావడంతో తొలి నుంచీ చెన్నైకి అభిమానులు ఎక్కువే. ధోనీతో పాటు స్టార్ఆటగాళ్లు సురేష్రైనా, రవీంద్ర జడేనా, అంబటి రాయుడు, షేన్వాట్సన్లు ప్రధాన ఆటగాళ్లు కావడంతో తొలినుంచీ జట్టు ప్రదర్శనపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అనుహ్యంగా టోర్నీ నుంచి మిస్టర్ ఐపీఎల్సురేష్రైనా, హర్బజన్సింగ్వైదొలగడంతో ప్రభావం జట్టుపై తీవ్రంగా పడినట్టు పాయింట్ల పట్టికను చూస్తే అర్థమవుతోంది. సీజన్‌-2020లో తొలి మ్యాచ్లోనే పటిష్టమైన ముంబైపై విజయం సాధించి ఖాతా తెరిచిన ధోనీ సేన అలాంటి ప్రదర్శన కేవలం ఒక్కమ్యాచ్కే పరిమితమైంది. టోర్నీ ఆసాంతం ఫేలమైన ఆట తీరుతో సీనియర్సిటిజన్స్అనే బిరుదుతో పాటు అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కొంది. రైనాలేని లోటు సగం దెబ్బతీసింది వాట్సన్‌, రాయుడు, డుప్లెసిస్తో పాటు ధోనీ లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్స్ఉన్నా.. జట్టును గట్టెక్కించలేకపోయారు. టాప్ఆర్డర్లో రైనా లేని లోటు టోర్నీ అంతా స్పష్టంగా కనిపించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోనీ నుంచి అభిమానులు ఎంతో అశించి చివరికి భంగపడ్డారు.స్థాయికి తగ్గ ఆటను కెప్టెన్ప్రదర్శించలేదని జట్టు యాజమాన్యంతో పాటు, అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. మరోవైపు సోషల్మీడియాలో సీఎస్కేపై పెద్ద ఎత్తున కామెంట్స్వస్తున్నాయి. వచ్చే సీజన్లోనైనా టీంను పూర్తిగా ప్రక్షాళన చేయాలని రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్కోరుతున్నారు. ధోనీ ఇక రిటైర్మెంట్ప్రకటించాలని కామెంట్స్పెడుతున్నారు. జట్లులో దాదాపు చాలామంది ఆటగాళ్లు 33 ఏళ్లుకు పైబడిన వారు కావడంతో ఇతర జట్లతో సమానంగా వేగాన్ని అందుకోలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. వారందరినీ తొలగించి యువకులతో కూడిన జట్టుతో బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. బౌలింగ్తో పాటు బ్యాంటిగ్ఆర్డర్లో పెద్ద ఎత్తున మార్పులు చేసి యంగ్ప్లేయర్స్ను తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తున్నారు. ఇక సీఎస్కే ప్రదర్శనపై సీఎస్కే జట్టు యాజమాన్యం విధమైన మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.

చెన్నై వైఫల్యం కాదు ఇక ధోనీ నిష్క్రమణే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *