Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

మహనీయుని మాట: ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి: హెలెన్ కెల్లర్ నేటి మంచిమాట: అధికమంది ఆమోదించినంత మాత్రాన అబద్దం నిజంకాదు. తప్పు ఒప్పు కాదు. దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 14, 2020  శుక్రవారం తిధి: దశమి ఉ 10:01 తదుపరి ఏకాదశి నక్షత్రం: మృగశిర రా తె 4:13 తదుపరి ఆరుద్ర యోగం: వ్యాఘాతం ఉ 8:03 కరణం: భద్ర ఉ 10:01 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి: వృషభం సూర్యోదయం:5:59 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: ఉ 10:30 - 12:00 యమగండం: మ 3:00 - 4:30 వర్జ్యం: ఉ 8:45 - 10:26 దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 అమృతకాలం: రా 9:21 - 11:01 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఓపెనర్ల పరీక్షలో ముగ్గురూ విఫలం…!

ఓపెనర్ల పరీక్షలో ముగ్గురూ విఫలం!

 

న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరిని బరిలోకి దించాలన్న ప్రశ్నకు 'న్యూజిలాండ్‌ ఎలెవన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌' సమాధానం ఇస్తుందని టీమ్‌ఇండియా భావించింది. అయితే ప్రస్తుతం హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న ఈ సన్నాహక మ్యాచ్‌లో ఓపెనర్ల రేసులో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌.. ముగ్గురూ విఫలమయ్యారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్‌ డకౌటవ్వగా, పృథ్వీ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ కూడా నిరాశపరిచాడు. ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. అయిదో స్థానంలో వచ్చిన రహానె (18) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 42 ఓవర్లకు భారత్‌ 103/4. పుజారా (40), హనుమ విహారి (29) క్రీజులో ఉన్నారు.

 


స్వదేశంలో ఓపెనర్లుగా రోహిత్, మయాంక్‌ భారీగా పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు గాయంతో రోహిత్‌ సిరీస్‌కు దూరం కావడంతో మయాంక్‌కు జోడీగా మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇటీవల మయాంక్‌ ఫామ్‌ కూడా గొప్పగా లేదు. 'భారత్‌ ఎ' జట్టు తరఫున అనధికారిక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. అంతేకాకుండా మూడు వన్డేల సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు తాజాగా సన్నాహక మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేదు. మరోవైపు పృథ్వీ షా వన్డే సిరీస్‌లో ఫర్వాలేదనిపించినా భారీ స్కోరు సాధించేలేకపోయాడు. అయితే 'భారత్‌-ఎ' మ్యాచ్‌లలో గిల్‌ చెలరేగాడు. అనధికారిక తొలి టెస్టులో 83, 204*, రెండో టెస్టులో 136 స్కోర్లతో చెలరేగాడు. కానీ తాజా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గిల్ కూడా విఫలమవ్వడం టీమ్‌ఇండియాను కలవరపెడుతోంది. దీంతో ఫిబ్రవరి 21 నుంచి కివీస్‌తో జరగనున్న తొలి టెస్టులో ముగ్గురిలో ఎవరికి ఓపెనర్లుగా అవకాశం దక్కుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

ఓపెనర్ల పరీక్షలో ముగ్గురూ విఫలం…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *