Top Ad unit 728 × 90

ఇండియన్ టీమ్స్ టూర్ షెడ్యూల్ ఇదే…!

ఇండియన్ టీమ్స్ టూర్ షెడ్యూల్ ఇదే…!

 

టీమ్ ఇండియా బుధవారం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లనున్నది. మూడున్నర నెలల సుదీర్ఘ పర్యటనలో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం స్వదేశంలోనే ఇంగ్లాండ్‌తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్ ఆడింది. ఇక ఇప్పుడు భారత జట్టు ఇంగ్లాండ్‌తో వారి దేశంలోనే తలపడటానికి బయలుదేరింది. ఈ ఏడాది కేవలం టెస్ట్ సిరీస్‌కు పరిమితం కానున్నది. వచ్చే ఏడాది మరో సారి ఇంగ్లాండ్‌లో పర్యటించి పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనున్నది. కాగా, టీమ్ ఇండియాకు ఈ పర్యటన చాలా కీలకమైనది. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్‌లో ర్యాంకింగ్స్ ఆధారంగా నెంబర్ వన్ జట్టుకే రెండేళ్లకు ఒకసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌ అంటూ ప్రకటించే వాళ్లు. 2018లో ఐసీసీ ప్రవేశపెట్టిన ఫార్మాట్ ఆధారంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిఫ్ ఫైనల్‌కు చేరే జట్లకు మధ్య ఫైనల్ నిర్వహించి.. గెలిచిన జట్టునే చాంపియన్‌గా నిర్దారించనున్నారు. అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా, న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. జూన్ 18 నుంచి 22 వరకు (23 రిజర్వ్ డే) సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్ వేదికగా ఈ ఫైనల్ జరుగున్నది.

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఐదు వారాల పాటు ఖాళీగానే ఇంగ్లాండ్‌లో గడపాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇరు దేశాల ప్రయాణాల మధ్య ఆంక్షలు ఉండటం వల్ల భారత జట్టు అక్కడే ఉండనున్నది. అయితే డబ్ల్యూటీసీ ముగిసిన తర్వాత భారత జట్టును బయోబబుల్‌లో ఉంచి ఇబ్బంది పెట్టమని ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం భారత క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూడా ఇంగ్లాండ్ వచ్చేందుకు అంగీకరించడంతో వారందరి కోసం ఈసీబీ ఆహ్లాదకరమైన వాతావరణంలో బస ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా ఐదు వారాల్లో ఎలాంటి ఆంక్షలు లేని ప్రదేశాలను చుట్టి వచ్చేందుకు కూడా అనుమతి లభించే అవకాశం ఉన్నది. దీని వల్ల క్రికెటర్ల మెంటల్ హెల్త్ పాడవకుండా ఉంటుందని బీసీసీఐ భావిస్తున్నది. అగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, అనంతరం ఐపీఎల్ కోసం యూఏఈ బయలుదేరి వెళ్లనున్నారు.

ఇక భారత పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టు కూడా ఒకే ఫ్లైట్‌లో ఇంగ్లాండ్ వెళ్తారు. ఈ రోజు రాత్రి బీసీసీఐ ఏర్పాటు చేసే చార్టెడ్ ఫ్లైట్‌లో ఇరు జట్ల క్రికెటర్లు, కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కలసి వెళ్తారు. కాగా ఈ పర్యటనలో మహిళల జట్టు ఇంగ్లాండ్ మహిళా జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది.

ఇండియన్ టీమ్స్ టూర్ షెడ్యూల్ ఇదే…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *