Top Ad unit 728 × 90

ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్‌.

ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్‌... ఓడినా ఆకట్టుకుంది.

 

ఇటీవలి కాలంలో ఐర్లాండ్‌ జట్టు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నా ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ప్రత్యర్థి జట్లు భారీ లక్ష్యాలను విధిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా ఐర్లాండ్‌ బ్యాటర్లు లక్ష్య ఛేదనకు ప్రయత్నించడమే అందుకు కారణం.

 

ఐర్లాండ్‌ పోరాట పటిమ క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఐర్లాండ్‌ 21 పరుగులతో ఓడినా సౌతాఫ్రికాకు మాత్రం చుక్కలు చూపించింది.

 

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ వికెట్‌ కీపర్‌ లోర్కన్‌ టక్కర్‌ (38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు) రాణించగా... చివర్లో జార్జ్‌ డాక్‌రెల్‌ (28 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఒక దశలో ఐర్లాండ్‌ విజయానికి చేరువగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బ్యాటర్లు ఒకేసారి వెనుదిరగడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 21 పరుగులతో ఓటమి పాలైంది.

 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్‌ (53 బంతుల్లో 74, 10 ఫోర్లు, ఒక సిక్స్‌), మార్ర్కమ్‌ (27 బంతుల్లో 56 పరుగులు, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. చివర్లో ప్రిటోరియస్‌ 7 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ప్రొటిస్‌ 200 పరుగుల మార్క్‌ను క్రాస్‌ చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో టి20 ఆగస్టు 5న (శుక్రవారం) జరగనుంది.

 

ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్‌. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *