Top Ad unit 728 × 90

వన్డేలకు ప్రమాదం లేదు: మైకేల్‌ హోల్డింగ్‌

వన్డేలకు ప్రమాదం లేదు: మైకేల్‌ హోల్డింగ్‌

 

టీ20లకు ఆదరణ పెరుగుతున్నా, వన్డే ఫార్మాట్‌కు ప్రమాదం ఏమీ ఉండదని వెస్టిండీస్‌ దిగ్గజం మైకేల్‌ హోల్డింగ్‌ అభిప్రాయపడ్డాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌ ద్వారా ఐసీసీకి చాలా ఆదాయం వస్తున్నదని, అందుకే వన్డేలను తీసేసే ఆలోచనను చేయదని సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అతడు చెప్పాడు. కాగా పొట్టి క్రికెట్‌ అధిక ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో వన్డే క్రికెట్‌ ప్రమాదంలోకి వెళుతున్నదని భారత దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌, ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌ సహా మరికొందరు గతంలో అభిప్రాయపడిన సంగతి తెలిసింది. ఈ వాదనపై హోల్డింగ్‌ స్పందించాడు.

 

"వన్డే క్రికెట్‌కు ప్రమాదం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వన్డే మ్యాచ్‌ల టీవీ హక్కుల ద్వారా ఐసీసీకి భారీ మొత్తం సమకూరుతున్నది. ఒకవేళ 50ఓవర్ల ఫార్మాట్‌ వద్దనుకుంటే ఐసీసీ తీవ్రంగా నష్టపోతుంది" అని హోల్డింగ్‌ చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో తక్కువ ఓవర్ల ఫార్మాట్లు సరికాదని అతడు అభిప్రాయపడ్డాడు. "త్వరలో 10-10 ఫార్మాట్‌ జరుగుతుంది.భవిష్యత్తులో ఐదు ఓవర్ల ఫార్మాట్‌ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా తగ్గించుకుంటూ పోతే చివరికి ఏమీ ఉండదు" అని హోల్డింగ్‌ అన్నాడు. కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌లో ఉమ్మిని నిషేధించడం వల్ల పెద్దగా సమస్యలు తలెత్తవని హోల్డింగ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఒకవేళ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే, ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐకి అన్ని హక్కులు ఉన్నాయని అతడు అన్నాడు. టీ20 విశ్వటోర్నీ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఐసీసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కన్నా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని మైకేల్‌ హోల్డింగ్‌ అభిప్రాయపడ్డాడు.

 

 

వన్డేలకు ప్రమాదం లేదు: మైకేల్‌ హోల్డింగ్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *