Top Ad unit 728 × 90

పాండ్యా అలాంటి కెప్టెన్‌ కాదు: వసీం జాఫర్‌

పాండ్యా అలాంటి కెప్టెన్‌ కాదు: వసీం జాఫర్‌

 

రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్యాపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీం ప్రశంసలు కురిపించాడు.

 

భారత టీ20 లీగ్‌ సమయంలోనే అతడి సత్తా ఏంటో చూపాడని అన్నాడు. ఈ కెప్టెన్‌ అందరిలా సురక్షితంగా ఆడాలని కోరుకోడంటూ వ్యాఖ్యలు చేశాడు. ముందు ముందు పాండ్యా మెరుపులు మరిన్ని చూడబోతున్నామని పేర్కొన్నాడు.

 

''ఆట పరంగా హార్దిక్‌ పాండ్యా ఎంతో పరిణితి చెందాడు. భారత టీ20 లీగ్‌ సమయంలో అందరినీ కలుపుకొంటూ ఆడిన తీరు చూసి ఇతడు ఆటగాళ్ల ఫేవరెట్‌ కెప్టెన్‌లా కనిపించాడు. జట్టు అంతా అతడికి స్పందించడం చూశాను. అలాగే మ్యాచ్‌లో తన ప్రదర్శన సైతం ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. అది చాలా మంచి విషయం. అందుకే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని కెప్టెన్‌గా ప్రకటించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఈ ఆల్‌రౌండర్‌ లెక్కలు వేసుకుని రక్షణాత్మక ధోరణితో ఆడే కెప్టెన్ కాదు. తాడో పేడో తేల్చుకునే రకం. భవిష్యత్తులోనూ అతడు జట్టుకు నాయకత్వం వహిస్తే ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో చూస్తారు'' అంటూ వసీం జాఫర్‌ కొనియాడాడు. భారత టీ20 లీగ్‌ 2022లో గుజరాత్‌ను నడిపించిన పాండ్యా... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 

పాండ్యా అలాంటి కెప్టెన్‌ కాదు: వసీం జాఫర్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *